ప్రకాశం: త్రిపురాంతకం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి హసన్ గారు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుని యర్రగొండపాలెం టీడీపీ పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తమ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలు మరియు ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎరిక్షన్ బాబు గారు సీఐ గారిని కోరారు.
E.G: విజయవాడ వరద బాధితులకు రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు అక్షర శ్రీ స్కూల్ విద్యార్థులు అండగా నిలిచారు. వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు రూ.లక్ష విరాళాలు సేకరించి ఆ సొమ్మును చెక్కు రూపంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శనివారం అందజేశారు. ఈ మేరకు స్కూల్ డైరెక్టర్ నాగరత్నం, విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.
KKD: శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఈరోజు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరిపించారు. అనంతరం ఆలయ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు.
కోనసీమ: ఉచిత ఇసుక విధానంపై అధికారులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన శనివారం ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ పోర్టల్ విధానంపై అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ ఉండాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ శనివారం శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్‌కు చెందిన 24వ డివిజన్ మహాలక్ష్మినగర్‌లో ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. వాటిని ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ప్రజలకు అందించిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. సామాజిక పెన్షన్ల రూ. 4000 చేశామని, అన్న క్యాంటీన్ల సేవలు వివరించారు.
ELR: రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాప్టు పబ్లికేషన్ ఈనెల 24వ తేదీన విడుదల చేయబడుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు లో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు.
E.G: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన నగదు చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాల వలన ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఈ ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు.
W.G: వీరవాసరం మండలం వడ్డిగూడెంలో కూలి పనికి వెళ్లిన సూర్యకుమారి(33) అనే మహిళ విద్యుత్ షాక్‌తో మరణించింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు పాలకొల్లు- భీమవరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మన్యం: పేదలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ చంద్ర అన్నారు. పట్టణంలోని 7వ, వార్డ్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. ఇటివల విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి, అధికారులు బాధితులకు అహర్నిశలు కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి చేసిన సేవలను ప్రజలు గుర్తించారన్నారు. వందరోజుల్లో మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకొన్నారన్నారు.
SKLM: జాతీయ అంధత్వ మరియు దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సంతబొమ్మాలి మండలం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ100 మందివిద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి ఎం ఆర్ కే దాస్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం వున్న 6 మందిని గుర్తించి ఉచితంగా అద్దాలు ఇస్తామన్నారు.
BPT: కొల్లూరు మండలం క్రాపలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ‘మన మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.11లక్షల కోట్లు అప్పులు మిగిల్చిన కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని అన్నారు.
GNTR: గుంటూరులోని గ్రీన్స్ అపార్ట్మెంట్‌కు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ఖండించారు. అపార్ట్మెంట్‌కు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని, నిర్మాణంలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని చెప్పారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవే తప్ప, ఒక్క రూపాయి అక్రమాలు చూపిస్తే జైలుకు వెళ్తానని తెలిపారు.
GNTR: కాకుమాను మండలం బికే పాలెం గ్రామంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల్లో అనేక ప్రజా కార్యక్రమాలు చేశామన్నారు.
TPT: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో శనివారం ఎర్రావారిపాళ్యం మండలం బోడేవాండ్లపల్లిలో కూటమి నాయకులు ‘మంచి ప్రభుత్వం కార్య క్రమం’ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రజలకు అందజేయనుందని వారు తెలిపారు.
TPT: తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం గ్రామ పంచాయితీ సచివాలయం-2లో శనివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్.ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఇందులో కూటమి ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు.