• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

VIDEO: 100రోజుల్లో అనేక ప్రజా కార్యక్రమాలు చేశాం: ఎమ్మెల్యే బూర్ల

GNTR: కాకుమాను మండలం బికే పాలెం గ్రామంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల్లో అనేక ప్రజా కార్యక్రమాలు చేశామన్నారు.

September 21, 2024 / 04:01 PM IST

ఎర్రావారిపాళ్యం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

TPT: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో శనివారం ఎర్రావారిపాళ్యం మండలం బోడేవాండ్లపల్లిలో కూటమి నాయకులు ‘మంచి ప్రభుత్వం కార్య క్రమం’ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రజలకు అందజేయనుందని వారు తెలిపారు.

September 21, 2024 / 04:01 PM IST

‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

TPT: తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం గ్రామ పంచాయితీ సచివాలయం-2లో శనివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్.ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఇందులో కూటమి ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు.

September 21, 2024 / 03:58 PM IST

మరోసారి స్పా సెంటర్‌పై దాడి

ఎన్టీఆర్: విజయవాడ బందర్ రోడ్డులో బాడీ స్పా సెంటర్ పై శనివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం -టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు యువతులు, ఇద్దరి యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు బాడీ మసాజ్ పేరిట క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రకాశ్ చెప్పారు.

September 21, 2024 / 03:58 PM IST

రేవంద్రపాడు వంతెనను పునర్నించండి

GNTR: రేవంద్రపాడు వద్ద బకింగ్ హోమ్ కెనాల్‌పై శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్నించాలని నూతక్కి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం మంత్రి లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రేవంద్రపాడు వంతెనపై నిత్యం వేలాదిమంది ప్రజలు, రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

September 21, 2024 / 03:57 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ

VZM: వేపాడ మండలం కొంపల్లి ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ పి బాల భాస్కరరావు శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో చతుర్విధ ప్రక్రియలు చేయించి వారి అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించాలని కోరారు.

September 21, 2024 / 03:57 PM IST

అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు

TPT: గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు-2 అంగన్వాడి కేంద్రాల్లో శనివారం పౌష్టికాహారం మాస ఉత్సవాలు నిర్వహించారు. విందూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ పౌష్టికాహార మాసోత్సవాలను సూపర్వైజర్ హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి ఆమె వివరించారు.

September 21, 2024 / 03:57 PM IST

బ్రిడ్జి పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం

W.G: చాగల్లు గ్రామానికి చెందిన ఒక యువకుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యకి చాగల్లుకి చెందిన రఘుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

September 21, 2024 / 03:55 PM IST

‘మాజీ సీఎంను అరెస్టు చేయాలి’

KKD: జగ్గంపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

September 21, 2024 / 03:54 PM IST

జిల్లాస్థాయి పోటీలకు 11 మంది ఎంపిక

SKLM: జిల్లాస్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలకు పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు శనివారం వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, రమణ, రజినీలు తెలిపారు. తొగరాంలో జరిగిన నియోజకవర్గస్థాయి వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంకయ్యారని అన్నారు. విద్యార్థులను హెచ్ఎం పి.వెంకట్రావు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

September 21, 2024 / 03:53 PM IST

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే శిల్పా

NDL: ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండల, పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరంగా పలు అంశాలపై చర్చించారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే శిల్పా తెలియజేశారు.

September 21, 2024 / 03:51 PM IST

ఈనెల 24న అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24వ తేదీన వికాస సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లోని సంస్థ జిల్లా కార్యాలయంలో మేళా ఉంటుందన్నారు. కాకినాడకు చెందిన రిప్యూటెడ్ ఫార్మా కంపెనీలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. SSC, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

September 21, 2024 / 03:48 PM IST

పేదల సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల

E.G: పేదల సంరక్షణ ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని నిధులు మంజూరు చేశారన్నారు.

September 21, 2024 / 03:43 PM IST

సీఎం చంద్రబాబు నాయుడు వినతుల స్వీకరణ

GNTR: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సాయం అందించారు. భూముల రీ సర్వేలో భూమి కోల్పోయిన వారు సీఎంకు ఫిర్యాదు చేశారు.

September 21, 2024 / 03:42 PM IST

‘ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదుకోవాలి’

ELR: కొల్లేరు వరదలు వల్ల వేలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులు ముంపునకు గురై నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం భీమడోలు సీఐటీయు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు.

September 21, 2024 / 03:38 PM IST