PLD: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం శనివారంతో ముగిసిందని పల్నాడు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో సార్ట్ యువర్ బిసినేస్ (SYB) అనే ప్రోగ్రాం ద్వారా నరసరావుపేట వాగ్దేవి కళాశాలలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉత్తమ జిల్లా స్థాయి సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం అమలాపురం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎండి అలీముల్లా చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
మన్యం: పార్వతీపురం ఐటిడిఎ ఇంఛార్జ్ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ శనివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
VSP: యరాడ బీచ్లో విదేశీ పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ఇటలీ దేశానికి చెందిన 8మంది విదేశీయులను యారాడ సాగర్ తీరానికి చేరుకొని ఈత చేయ సాగారు. సముద్రపు అలలు వీరిని లోపలికి లాక్కెళ్లిపోవడంతో మిగిలి ఉన్న ఇటలీ దేశస్తులు అక్కడే ఉన్న స్థానికులకు కేకలు వేశారు. సముద్రంలో కోట్టుకుపోతుండగా లైఫ్ గార్డ్స్‌కు చెందిన సిబ్బంది అక్కడ ఉండడంతో వెంటనే వీరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.
అన్నమయ్య: యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టమైన పని కూడా విజయవంతం అవుతుందని రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి అన్నారు. శనివారం రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా సులభం అవుతుందన్నారు.
PLD: రాష్ట్రాన్ని గత పాలకులు రాతియుగంగా చేశారని కానీ నేడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని స్వర్ణ యుగంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం కారంపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్‌ను విడుదల చేశారు.
TPT: రైల్వే స్టేషన్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో భరత్ అనే ఉద్యోగి విద్యుత్ తీగల మరమ్మతులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హై టెన్షన్ తీగలు తగిలి కుప్పకూలాడు. దీంతో తోటి సిబ్బంది హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ASR: దేవీపట్నం మండలం ఇందుకూరు స్థానిక స్త్రీ శక్తి భవనంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పాల్గొని వంద రోజులలో కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచడం జరిగిందని, అలాగే రాబోయే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తెలిపారు.
ప్రకాశం: పొదిలి పట్టణంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. సమర్థవంతమైన నాయకత్వం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించారు.
VZM: సంక్షోభంలోనూ సంక్షేమ పాలనను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మక్కువ మండలం గోపాలపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించి ప్రజలకు ప్రభుత్వ పాలన గురించి వివరించారు.
కోనసీమ: కూటమి ప్రభుత్వ 100 రోజుల పరిపాలన ప్రజారంజక పాలన దిశగా అడుగులు వేస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. పడమటిపాలెంలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో MLA మాట్లాడారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, తదితర రంగాలు నిర్లక్ష్యం చేశారన్నారు.
KKD: కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఈనెల 15వ తేదీన జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ త్రీ టౌన్ సీఐ కెవిఎస్ సత్యనారాయణ తెలిపారు. ఆయన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈశ్వరరావు హత్య ఉదాంతాన్ని వివరించారు.
బాపట్ల: యద్దనపూడి మండల పరిధిలోని యనమదలలో నూతన సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల జిల్లా కలెక్టర్ జి. వెంకట మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఏలూరు: నూజివీడులో వరదల కారణంగా గండి పడిన పెద్దచెరువు గట్టు మరమ్మతు పనులకు శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నూజివీడు ప్రజలు కష్టాలు పడడంతోపాటు, పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. రూ.4 కోట్ల నిధులతో మరమ్మతు పనులు చేపట్టామన్నారు.
కృష్ణా: నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో గల సెయింట్ మేరీస్ పాఠశాల సమీపంలో శనివారం పట్టపగలు చోరీ జరిగిన సంఘటన సంచలనంగా మారింది. ఇటుకల వ్యాపారి వల్లభనేని రామకృష్ణ ఇంటిలో ఎవరూ లేని సమయంలో అగంతకులు చోరీ చేశారు. అగంతకులు 12 కాసుల బంగారం, మూడు కేజీలు వెండి, 45 వేల రూపాయల నగదు చోరీ చేసినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.