NDL: నంద్యాల పట్టణంలో రేపు (ఆదివారం) ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు వైద్యులు రజినీ దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పురుషులకు వీర్యకణాల పరీక్ష, మహిళలకు స్కానింగ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.