పల్నాడు: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈనెల 17 నుంచి టెన్త్ దూర విద్య హాల్‌టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్ల ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మన మిత్ర వాట్సప్ నంబర్ ద్వారా కూడా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్ హాల్‌టికెట్ల వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.