అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞత కలిగిన మనిషి అని తాను అనుకోవడం లేదన్నారు. ‘అతడు తెలివైన, కఠినమైన వ్యక్తి. బైడెన్ పాలనా కాలంలో చిన్నారి నుంచి చాక్లెట్ లాగేసుకున్నట్లు మా దేశం నుంచి 350 బిలియన్ డాలర్లు తీసుకున్నాడు’ అని పేర్కొన్నారు.