NLR: ఇంటి పన్నులు, కొళాయి పన్నులు క్రమబద్ధీకరణ పేరుతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారీగా పెంచేసారని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆరోపించారు. ‘ప్రజా చైతన్య యాత్రలు’ పేరుతో మూడవరోజు సోమవారం నగరంలోని 53వ డివిజన్లో సీపీఎం నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.