ATP: గుత్తిలోని కేంద్రీయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మల్కి సాబ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీలోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ను ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.