ATP: ఈనెల 12న జరగబోయే వైసీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువత పోరు పోస్టర్లను వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 12న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా జరిగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు.