NLG: నార్కట్ పల్లి మండలం ఏపి లింగోటం గ్రామంలో, యాదవ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.