ATP: రాయదుర్గం పట్టణం కోటలో జంబుకేశ్వర,వెంకటేశ్వర స్వామి ఆలయాలకు అనుకొని ఉన్న ఉపరితకుంట ఆక్రమణలకు గురి అవుతోందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు దేవరెడ్లపల్లి రాజేష్ పేర్కొన్నారు. హిందువుల భక్తి విశ్వాసాలతో కూడిన ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉపరిత కుంటను ఆక్రమణదారులు స్వచ్ఛభారత్ అభియాన్ అనే ముసుగులో ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుండడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.