GNTR: నాగార్జున విశ్వవిద్యాలయం బీఈడీ ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో 9మంది ఏజెంట్లతో పాటూ వినుకొండలో ఓ కళాశాలకు చెందిన ఛైర్మన్, కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర పోషించారు. ఈమేరకు అధికారులు తెనాలిలో ఓవ్యక్తిని విచారించగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నాపత్రం తనకు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత ప్రశ్నాపత్రం వినుకొండ నుంచి అందరికీ ఫార్వార్డ్ అయినట్లు నిర్థారించారు.