పల్నాడు: వేసవికాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెదకూరపాడు పీహెచ్సీ డాక్టర్ విద్య తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, దాంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ లోపించి అలసట, తలనొప్పి, వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. రోజు నాలుగు లీటర్ల నీరు తాగాలని సూచించారు.