ఓ సూక్ష్మ చిత్ర కళాకారుడు తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ఫోటోను గుమ్మడి గింజపై చెక్కాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనీ డబుల్ అవుతుందనే ఆశతో ఓ యాప్‌లో చాలామంది పెట్టుబడి పెట్టారు. తొలుత బానే డబ్బులు ఇచ్చినప్పటికీ తర్వాత.. యాప్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ శ్రేణులు గొడవపడ్డాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
పై చదువలు కోసం విదేశాలకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నెల రోజుల తరువాత బాడీని స్వదేశానికి తీసుకొస్తుండటం విశేషం.
బిగ్‌బాస్ షో సెన్సార్ విషయంలో ఏపీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసారం అయ్యాక పిటిషన్లను పరిశీలించడం అంటే పోస్ట్‌మార్టం చేసినట్లే అని ఘాటుగా స్పందించింది. ఈ విషయంపై కేంద్రానికి తగిన సూచలను ఇవ్వాలని పేర్కొంది.
గత రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నాయి. విద్యార్థుల దృష్ట్యా కొన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ 10 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై పార్లమెంటు(Parliament)లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సర్కారు (NDA Govt) సమాధానం చెప్పింది.
బిర్యానీ కోసం ఆశపడిన ఇద్దరు యువకులు.. తమతో తీసుకొచ్చిన రూ.4 లక్షల నగదును పట్టించుకోలేదు. స్కూటీ డిక్కీలో పెట్టగా.. అందుల్లోంచి చోరీ చేశారు.
తన సహచర నటి, స్నేహితురాలు రమ్యకృష్ణకు (Ramya Krishna) మంత్రి రోజా (Roja Selvamani) బొట్టుపెట్టి, చీర పెట్టారు. తన ఇంటికి వచ్చిన అతిథికి గౌరవంగా స్వాగతం పలకడంతో పాటు మంచి ఆతిథ్యం ఇచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తడబడ్డారు. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థి భరత్‌ను గెలిపించాలని.. ఆయన గెలిస్తే సీఎం అవుతారని కామెంట్స్ చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం 'జైలర్' విడుదలకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విడుదలైన 'కావాలా', 'హుకుం' రెండు సింగిల్స్ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూలై 26న సాయంత్రం 6 గంటలకు మూడో సింగిల్ 'జుజుబీ'ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
నారా రోహిత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి దాదాపు నాలుగైదేళ్లు అవుతోంది. కానీ రీ ఎంట్రీలో మాత్రం సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు నారావారబ్బాయి. ఇప్పటికే నాలుగైదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఇప్పుడు తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేయగా.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంది.
విజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో భారీ చోరి జరిగింది. డబ్బున్న బ్యాగ్‌ను బస్సులో పెట్టి టిఫిన్ చేసి వచ్చే సరికి బ్యాగ్ మాయం అయింది. అందులో రూ.28 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు నార్కెట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దేశవ్యాప్తంగా బైక్స్, ఆటోలు, కార్లు సహా పలు వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చట్టవిరుద్ధమని అందరికీ తెలుసు. అయితే తాజాగా ఏపీలో బ్లూటూత్ హెడ్ సెట్స్, ఇయర్ ఫోన్స్ కూడా ప్రయాణించే సమయాల్లో వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు.