ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఓంగోలు మాజీ ఎమ్మెల్యే బలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
గడచిన కొన్ని నెలల కిందటి సాధారణ ఎన్నికలకు ముందు, బాలినేని కూటమిలో టికెట్ ఆశించారని బలంగా ఊహాగానాలు వినిపించాయి, టికెట్ద దక్కకపోవడంతో వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టకుండా పోటీలో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆయన తన రాజీనామా ద్వారా తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా బలినేని, గురువారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలవనున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరిపి, రాజకీయ భవిష్యత్తుపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గత ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినా, ఓంగోలులో తన ప్రత్యర్థి దామచర్ల జనార్ధనపై గెలవలేకపోయిన సంగతి తెలిసిందే. YSR టైం నుంచి వై యస్ కుటుంబానికి అత్యంత విధేయుల్లో బాలినేని ఒకరుగా ఉండేవారు. అలంటి బాలినేని పార్టీని వీడటం వైస్సార్సీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.