»Balineni Srinivasa Reddy As Long As He Is In Politics Is Cm Jagan Going
Balineni Srinivasa Reddy: రాజకీయాల్లో ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగింది.
Balineni Srinivasa Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా వేరే పార్టీకి మారుతున్నారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగింది. అయితే దీనికి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగెస్ పార్టీ నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఒంగోలు నుంచే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. విలువలతో ఉన్న రాజకీయాలు మాత్రమే చేస్తానని.. విలువల కోసం మంత్రి పదవిని కూడా వదులుకుని సీఎం జగన్ వెంట నడిచానని వెల్లడించారు.
సామాజిక సమీకరణల నేపథ్యంలోనే ఎమ్మెల్యేల స్థానాల మార్పు జరుగుతోంది. గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానంటూ వచ్చి వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీ మారుతున్నానంటూ వచ్చిన వార్తలు అవాస్తవం. అసలు తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోనే లేనని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటానని తెలిపారు. ఇలాంటి సమయాల్లో ప్రతిఒక్కరూ సీఎం జగన్‌కు అండగా ఉండాలని తెలిపారు.