VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముంజేరులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇళ్ల స్థలాలు, విద్యుత్ వంటి సమస్యలు అందాయి. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.