TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో నల్గొండ జిల్లా దేవరకొండకు వెళ్లనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. రూ.23 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శేరిపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.