NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవన్లో శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అధ్యక్షుడు ఎన్వీటీ, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి భాస్కర్ సభ్యులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులని మరువరాదని అన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు.