TG: గుమ్మడి నర్సయ్య మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. తాను ఒకసారి MPగా, ఐదుసార్లు MLAగా గెలిచానని, నర్సన్న ఐదుసార్లు MLAగా గెలిచారని చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరూ ఆయనకు పోటీ కాదన్నారు. MLA అయినా తనకున్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించారని, తనకు వచ్చిన జీతాన్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టారని తెలిపారు.