NZB: డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమందరం అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.