MBNR: క్రీడారంగా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వారణాసిలో జరిగిన 69వ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నారు.