Iam Not Change The Party: Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. బాలినేని (Balineni) పార్టీ మార్పుపై ఊహాగానాలు నెలకొన్నాయి. దీంతో సీఎం జగన్ను (jagan) ఈ రోజు కలిశారు. అన్నీ అంశాల గురించి డిస్కషన్ చేశానని బాలినేని (Balineni) మీడియాకు తెలిపారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం జగన్కు వెల్లడించానని తెలిపారు. ఒకరిద్దరూ నేతలతో తనకు సమస్య ఉందని చెప్పారు.
ప్రోటోకాల్ పెద్ద విషయం కాదని బాలినేని (Balineni) అన్నారు. ఆ అంశంపై కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదని చెప్పారు. రీజినల్ కో ఆర్డినేటర్ పదవీపై చర్చ జరగలేదని.. వద్దని పదవీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పార్టీ మారడం లేదని.. అదీ ప్రచారం మాత్రమేనని తోసిపుచ్చారు. ఇటీవలు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni) కంటతడి పెట్టారు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా హైటెన్షన్ నెలకొంది.
తాను టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే వివాదాలు సృష్టిస్తున్నారని బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni) పేర్కొన్నారు. తన మీద ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు బాలినేనిపై (Balineni) సీనియర్ నేత గోనె ప్రకాశ రావు కామెంట్స్ చేశారు. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బాలినేని (Balineni) కన్నీటి పర్యంతం అయ్యారు. బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni) బావమరిది వైవీ సుబ్బారెడ్డి. ఇప్పుడు వీరిద్దరికీ పడటం లేదు. వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ తోడళ్లు అనే విషయం తెలిసిందే.