Gone Prakash Rao:మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై (balinani srinivasa reddy) సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు (Gone Prakash Rao) మండిపడ్డారు. వైసీపీ హై కమాండ్‌పై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని.. ఒంగోలు డీఎస్పీ విషయం.. ఇతరత్రా అంశాలపై కినుక వహించారు. వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గోనె ప్రకాశ్ రావు (Gone Prakash Rao) స్పందించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాలినేని గత చరిత్ర గుర్తుంచుకోవాలని సూచించారు.
బాలినేని శ్రీనివాస రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది వైవీ సుబ్బారెడ్డి అని గుర్తుచేశారు. సుబ్బారెడ్డి చెల్లిని బాలినేని (balinani) పెళ్లి చేసుకున్నారని.. బావకు రాజకీయంగా అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పుడు సుబ్బారెడ్డిని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు. గ్యాంబ్లింగ్‌లో వందల కోట్లు బాలినేనికి ఎలా వచ్చాయని అడిగారు. అందరికీ డబ్బులు పోతే.. శ్రీలంకలో ఇతనికి వచ్చాయని చెప్పారు. బాలినేని టీడీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని తెలిసింది.. వెళితే వెళ్లని, కానీ వైవీ సుబ్బారెడ్డిపై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.
వైఎస్ఆర్ హయాంలో జరిగిన పరిణామాలను గోనె ప్రకాశరావు (Gone Prakash Rao) గుర్తుచేశారు. కడప జిల్లా వ్యవహారాలను వైఎస్ఆర్, ప్రకాశం జిల్లా ఇష్యూస్ వైవీ సుబ్బారెడ్డి చూసుకేనేవారని తెలిపారు. మిగిలిన 21 జిల్లాల సమస్యలను కేవీపీ చూసేవారని చెప్పారు. కేవీపీ వద్ద సమస్య పరిష్కారం కాకుంటే వైఎస్ఆర్ వద్దకు వచ్చేవారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఎదగడంలో కేవీపీ, వైవీ సుబ్బారెడ్డి ఇద్దరు కీ రోల్ పోషించారని తెలిపారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైవీ గురించి కామెంట్స్ చేయడం తనకు నచ్చలేదని.. అందుకే రియాక్ట్ అయ్యానని గోనె ప్రకాశ రావు వివరించారు.
ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. మైత్రీ మూవీ మేకర్స్‌లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల హైదరాబాద్‌లో గల మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.