సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఆలయాల పున:నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆలయాల నిర్మాణానికి ముందుకువచ్చింది. ఆలయం కరీంనగర్ లో నిర్మాణం కావడం మా అదృష్టం’
తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాంతంగా (Spiritual Place) అభివృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్ (KCR) పెద్ద ఎత్తున ఆలయాల పున:నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) కూడా ఆలయాల నిర్మాణానికి ముందుకువచ్చింది. తాజాగా కరీంనగర్ జిల్లాలో (KarimNagar District) అతిపెద్ద వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి బుధవారం పునాది రాయి (Foundation Stone) పడింది. ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (VY Subba Reddy) శంకుస్థాపన చేశారు.
కరీంనగర్ లోని పద్మ నగర్ లో ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ 10 ఎకరాలు భూమి కేటాయించారు. ఆ స్థలంలో బుధవారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar), ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ప్రణాళిక సంఘం రాష్ట్ర చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న టీటీడీకి (TTD) కృతజ్ణతలు. ఆలయం కరీంనగర్ లో నిర్మాణం కావడం మా అదృష్టం’ అని తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘తిరుమలలో (Tirumala) మాదిరిగా కరీంనగర్ లో సర్వకైంకర్యాలు జరుగుతాయి. టీటీడీ తరఫున అర్చకులు, సిబ్బంది, ప్రసాదంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయి. పోటు ద్వారా ప్రసాదాలను (Prasad) స్థానికంగా తయారు చేస్తాం’ అని వివరించారు. కాగా సాయంత్రం సాయంత్రం శోభాయాత్ర అనంతరం శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ ఆలయం 10 ఎకరాల్లో రూ.20 కోట్లతో అత్యంత సుందరంగా కొలువుదీరనుంది.