ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సీలిండర్ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి పండుగకు సంబందించి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనితోపాటు, NDA కూటమి ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నట్లు అర్థం అవుతుంది. కొన్ని రోజులు క్రితమే ఉచిత ఇసుక విధానం కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలలో భాగంగా, పేద ప్రజలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పథకాన్ని “మహా శక్తి” అని నామకరణం చేశారు, ఇది పేదలకు మంచి మద్దతుగా నిలుస్తుంది.
ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “తిరుమల లడ్డూ తయారీలో కల్తీ పదార్ధాలను, జంతు కొవ్వులు ఉపయోగించడం అనేది అధికార దుర్వినియోగం, లెక్కలేని తనంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు పవిత్రంగా భావించే తిరుమల పవిత్రతను దెబ్బ తీసారని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు నాయుడు, ఈ పథకాలతో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకునే చర్యలను కూడా వివరించారు. ఈ ఉచిత వాయిదా పథకం, ముఖ్యంగా పేదవర్గాల జీవితాలను మెరుగుపరచడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.