ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్స్టర్ లుక్లో గన్ పట్టుకుని ఉన్నాడు. కొంతమంది ఈ చిత్రాన్ని అల్లుఆర్జున్ నటిస్తున్న “పుష్ప: ది రూల్” సినిమా కోసం తీసినట్లుగా భావిస్తున్నారు.
అయితే, మరికొంత మంది ఈ చిత్రం డేవిడ్ వార్నర్ యొక్క ఎడ్వర్టయిజింగ్ షూట్ నుంచి ఉండవచ్చని అంటున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ CRED యాప్ యొక్క కమర్షియల్లో నటించడంతో, ఈ వార్తలో కొంత నిజం ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
డేవిడ్ వార్నర్ ఇండియా లో అత్యధిక ఫ్యాన్స్ ఉన్న క్రికెటర్. ఆయన తన కుటుంబంతో కలిసి తెలుగు సినిమా సూపర్ హిట్ పాటలకు డాన్స్ చేసి అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించాడు. “అల వైకుంఠపురములో” “సరిలేరు నీకెవ్వరూ” పాటలతో ఆయనకు విశేషమైన ప్రజాదరణ సంపాదించింది, ముఖ్యంగా సన్రైజర్స్ హైద్రాబాద్ జట్టులో ఉండగా.
అయితే, డేవిడ్ వార్నర్ “పుష్ప” సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారనేది నిజమైతే, ఇది అభిమానులకు నిజంగా ఒక పెద్ద పండుగే. తెలుగు చిత్ర పరిశ్రమలో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ రావడం సినిమాప్రేముల కోసం ఒక ప్రత్యేక అనుభవం కావడం పక్కా. ఈ వార్తపై మక్లారిటీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు