తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై ఈరోజు ఉదయం జీరో FIR నమోదయ్యింది. చాలా తక్కువ సమయంలో ఈ విషయం మీడియాకు చేరింది.
ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. పార్టీ పేరుతో నిబంధనల ప్రకారం, జానీ మాస్టర్‌ను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, జానీ మాస్టర్‌ను అన్ని జనసేన పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలన్న ఆదేశం కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ తక్షణ చర్య, జనసేన పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభినందిస్తున్నారు.
మరో పక్క ఈ ఘటన రాజకీయంగా అగ్గిని రాజేస్తోంది. వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని, నాయకులను ఆదేశించి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక మహిళపై టీడీపీ ఎమ్మెల్యే లైంగికంగా వేధించారని కేసు నమోదయిన విషయం తెలిసిందే. టీడీపీ కూడా ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది. అయితే ఆ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందే వైసీపీ నుండి టీడీపీ కి రావడం గమనార్హం