ప్రకాశం: మార్కాపురం డీఎస్పీ నాగరాజును జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా బోకేని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా జర్నలిస్టులు సబ్ డివిజన్‌లోని పలు సమస్యలను డీఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లారు.
BPT: బాపట్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ నాయకుడు జోగి రాజాపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం బాపట్ల సీఐ అహ్మద్ జానీని కలిసి జోగి రాజాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ.. నాయకులను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
GNTR: ప్రతి ఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత తెలిపారు. పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఫిరంగిపురం మండలం మేరకపూడి అంగన్వాడీ కేంద్రంలో శనివారం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారం గురించి సునీత తెలిపారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తల్లిదండ్రులు పంపించాలన్నారు.
VZM: అక్రమ వ్యాపారాలు, రవాణా వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. రామభద్రపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. మద్యం, నాటుసారా నిల్వలు, బహిరంగ మద్యపానం వంటి చర్యలు చట్ట వ్యతిరేకమన్నారు. బహిరంగంగా మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నరు.
NLR: వరికుంటపాడులోని విరుపూరు శివారు ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్ 518 గ్రామకంఠం భూమిని అటవీశాఖ అధికారులు తప్పుడు పత్రాలతో రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్లాంటేషన్ పనులు చేపట్టడం సరికాదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఈ భూమిపై అనేక న్యాయ పోరాటాలు చేస్తున్నప్పటికీ కోర్టు స్టే ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు కేసులు పెడుతున్నారు.
E.G: ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కడియం-కొవ్వూరు స్టేషన్ల మధ్య పనులతో ఈ నెల 29న తిరుపతి-విశాఖ, 30న విశాఖ-తిరుపతి, విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ, విశాఖ-గుంటూరు, గుంటూరు-విశాఖ, అక్టోబర్ 1న విశాఖ-గుంటూరు, 30న విజయవాడ-రాజమండ్రి, రాజమండ్రి విశాఖ, విశాఖ-రాజమండ్రి రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం: నిరంతరం ప్రజల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. సార్వకోట మండలం గోవర్ధనపురం గ్రామంలో శనివారం జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాల పాల్గొని మాట్లాడారు. ఆయనతోపాటు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు అధికార పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ ధర్మానతేజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడిన విషయంపై ప్రశ్న అడిగారు ఒక రిపోర్టర్. ఈ సందర్భంలో, జగన్ తనడైన శైలిలో స్పందించారు. “ఒకసారి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ప్రారంభమైతే, ఓటరుకు ప్రభుత్వం వాగ్దానం చేసిన పథకాలను అమలు చేయడం లేదు, మోసగించబడ్డారని అర్థం చేసుకుంటే, ఆ ఓటు ఎవరూ ఆప...
తిరుమల లడ్డూ వివాదం చుట్టూ జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన Xలో చేసిన పోస్ట్‌లో, “ఇది చాలా సున్నితమైన విషయం , తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ రావడం చాలా బాధాకరం,” అని పేర్కొన్నారు. ఈ అంశంపై సాంక్షేతికతను ఉంచేందుకు సమగ్ర విచారణ అవసరమని ఆయన నొక్కిచెప్పారు. Read Also: దీపావళికి AP మహిళలకు శుభవార్త సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ ...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్యంగా అక్టోబర్ 8న గరుడసేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం...
స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతోపాటు, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రత...
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Xలో చేసిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువు అయ్యింది. పవన్, “తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు (ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు) కలిసినట్లు కనుగొన్నందుకు మేము తీవ్రంగా కలత చెందాము. టీటీడీ బోర్డుకు గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో నిబంధనలపై సమాధానాలు అందించాలి,” అని పేర్కొన్నారు. ఆయన ఈ విషయంపై జాతీయ...
టీడీపీ నేత, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఒక జర్నలిస్టు చేసిన ప్రశ్నకు సమాధానంగా, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “వైఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ చూసిన ఒక అసమర్ధ ముఖ్యమంత్రి,” అని లోకేష్ అన్నారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆయనకు ప్రజలు గుర్తురాలేదు. ప్రజలకు సహాయం చేయడం బదులు, కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారని...
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి శ్రీ రంగరాజన్ గారు తన అభిప్రాయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంలో, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. Read Also: దీపావళికి AP మహిళలకు శుభవార్త పవన్ కళ్యాణ్, “దేశవ్యాప్తంగా ధార్మిక పరిషత్...