తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్లో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడిన విషయంపై ప్రశ్న అడిగారు ఒక రిపోర్టర్. ఈ సందర్భంలో, జగన్ తనడైన శైలిలో స్పందించారు.
“ఒకసారి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ప్రారంభమైతే, ఓటరుకు ప్రభుత్వం వాగ్దానం చేసిన పథకాలను అమలు చేయడం లేదు, మోసగించబడ్డారని అర్థం చేసుకుంటే, ఆ ఓటు ఎవరూ ఆపలేరు. ఎలాంటి సీనియర్ నేత ఆ ఓటును ఆపలేరు,” అని జగన్ స్పష్టం చేశారు.
మరో రిపోర్టర్, జగన్ చుట్టూ కొందరు నేతల వర్గం ఉందనే విషయంపై ప్రశ్న అడిగితే, “ప్రస్తుత విషయం డైవర్షన్ అవుతోంది,” అని ఆయన సమాధానం ఇచ్చి దాటవేశారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వైఖరిని సమర్థించారు, కాగా మరికొంతమంది విమర్శించారు. ముఖ్యంగా, పార్టీని వీడిన బాలినేని వంటి ప్రముఖ నేతలు, పార్టీకి కలిగించిన ప్రభావం ఎలా ఉంటుందో అనేది సర్వత్రా చర్చకు దారితీస్తుంది.