• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలంలోని గుంటుపల్లి వారి వీధి నుంచి ప్రసాదంపాడు వరకు రూ.1.3 లక్షల నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్రంలోని రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 3, 2026 / 04:32 PM IST

సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

KRNL: సీఎం సహాయ నిధి పేదలకు వరమని MLA బొగ్గుల దస్తగిరి అన్నారు. ఇవాళ కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎర్ర పకీరయ్య, మందపోగు అంజి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు సహా ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

April 3, 2026 / 04:30 PM IST

మంగళగిరిలో గ్యాస్ ఏజెన్సీల ఇష్టారాజ్యం

GNTR: మంగళగిరిలో గ్యాస్ ఏజెన్సీల డోర్ డెలివరీ దోపిడీపై జనం మండిపడుతున్నారు. సిలిండర్లను ఇళ్ల వద్దకు తీసుకురాకుండా కూడళ్లలో ఆటోలు నిలిపి, అక్కడికే వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారు. పైగా రూ.936 బిల్లుకు ఏకంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ చేసినవారికి ఇక్కట్లు తప్పడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

April 3, 2026 / 04:27 PM IST

డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

కోనసీమ: రామచంద్రపురంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో CSR నిధులు రూ.16 లక్షలతో నిర్మించనున్న డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. దీని ద్వారా కిడ్నీ రోగులకు సులభంగా చికిత్స అందజేయవచ్చు అన్నారు.

April 3, 2026 / 04:21 PM IST

చింతూరు ఎస్సై బాధ్యతలు స్వీకరణ

ASR: చింతూరు ఎస్సైగా ఎం.సంతోష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్టేషన్ సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు. ఆయన బదిలీ‌పై వీఆర్‌పురం నుంచి ఇక్కడకు వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పని చేసిన రమేష్ రంపచోడవరానికి బదిలీ అయ్యారు.

April 3, 2026 / 04:13 PM IST

‘మహిళలు క్రీడలలో రాణించాలి’

SKLM: మహిళలు క్రీడలలో రాణించాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసకు చెందిన జరా సిద్విక్‌ ఇటీవల మంగళూరులో జరిగిన మహిళా పవర్ లిఫ్టింగ్ పోటీలలో 69 కేజీల విభాగంలో 375 కేజీలు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం తన కార్యాలయంలో దుస్సాలువతో సత్కరించి అభినందించారు

April 3, 2026 / 04:12 PM IST

ఏప్రిల్‌ 5న జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

TPT: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హరిత విప్లవానికి తోడ్పడిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలను ఏప్రిల్‌ 5వ తేదీ ఆదివారం TTD ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొని నివాళులర్పించనున్నారు.

April 3, 2026 / 04:05 PM IST

సంగమేశ్వరుని తేరుకు పోటెత్తిన భక్తులు

ATP: కూడేరులో వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి తేరు వేడుక కనులపండువగా జరిగింది. ఈ రథోత్సవానికి అనంతపురం జిల్లా నుంచి నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి రథం గ్రామంలో వైభవంగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

April 3, 2026 / 04:05 PM IST

జనసేన కార్యాలయాన్ని సందర్శించిన ఒనుడా ఛైర్మన్

నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జనసేన నగర కార్యాలయాన్ని ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ONUDA) ఛైర్మన్ షేక్ రియాజ్ సందర్శించారు. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించిన రియాజ్.. నెల్లూరులో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసిన జనసైనికులను అభినందించారు.

April 3, 2026 / 04:01 PM IST

కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు

ELR: పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కోడూరుపాడులో శుక్రవారం ఆరోగ్య విస్తరణ అధికారి వై.వి. లక్ష్మణరావు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. “ఫ్రైడే-డ్రైడే” కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నిల్వ నీటిని తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.

April 3, 2026 / 04:00 PM IST

హాస్టళ్లపై కలెక్టర్ కఠిన ఆదేశాలు

NDL: జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల పనితీరును మెరుగుపరచాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి హాస్టల్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆమె వెల్లడించారు.

April 3, 2026 / 04:00 PM IST

ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం న్యాయమా

KRNL: మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ రూ.20వేల కోట్లతో ‘మావిగన్’ పేరుతో రాజధానిని అభివృద్ధి చేయాలన్న మాజీ CM జగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని జిల్లా YCP అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ స్పష్టం చేశారు. గ్రోత్ ఇంజన్ లేని రాష్ట్రంలో రూ.2లక్షల కోట్లతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.

April 3, 2026 / 04:00 PM IST

నిడదవోలులో మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

E.G: రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ నిడదవోలు విచ్చేశారు. మంత్రిని ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆత్మీయంగా పలకరించారు. ముందుగా పుష్ప గుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు. ఒకే చోట జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కలవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

April 3, 2026 / 04:00 PM IST

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి ఎబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమ్మర్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి కష్టాలు కలగకుండా ఈ బృందం తక్షణ పరిష్కార మార్గాలను చూపుతుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బోరు వేయించారు. వాటర్ ట్యాంకు నుంచి మోటారు సౌకర్యం కల్పించారు.

April 3, 2026 / 04:00 PM IST

‘భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారు’

KKD: 1903 ఏప్రిల్ 3న మంగళూరులో జన్మించిన కమలాదేవి చటోపాధ్యాయ భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారని రిటైర్డ్ ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్య పేటలో ఇవాళ కమలాదేవి చటోపాధ్యాయ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారన్నారు.

April 3, 2026 / 04:00 PM IST