ATP: గుత్తిలో స్టాంపుల కొరత లేదని సబ్ రిజిస్ట్రార్ మంజునాథ్ బుధవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొందరు స్టాంపుల కొరత ఉందని ప్రచారం చేస్తున్నారని, కస్టమర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి స్టాంపులు తీసుకెళ్లవచ్చునన్నారు. రూ.10, 20, 30, 50 విలువజేసే స్టాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు.
ELR: ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. బుధవారం RWS SE త్రినాధ్, DE రామారావు, AE సుబ్రహ్మణ్యం మరియు RWS ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అన్నమయ్య: జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ నిఘా ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జాతరలు, పాఠశాలలు, శివారు ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతోందని, అనుమానాస్పద కదలికలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు 100/112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. డ్రోన్ కెమెరాల ద్వారా రియల్ టైమ్ సమాచారం సేకరిస్తూ ప్రత్యేక బృందాలు పని చేస్తున్నయన్నారు.
ప్రకాశం: పామూరు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వినోద్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎద్దుల పోటీలను ఎమ్మెల్యే నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. మార్కాపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ M.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎద్దుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ కాశీనాథ్, కూటమి నేతలు పాల్గొన్నారు.
KDP: చక్రాయపేట మండలం మహాదేవపల్లెకు చెందిన రైతు నరసింహులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మామిడికాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తన తోటలోని 172 మామిడి చెట్లను బుధవారం నరికివేశారు.17 ఏళ్లుగా సాగు చేసిన చెట్లకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
VZM: రేగిడి ఆమదాలవలస డిప్యూటీ MPDO తుమ్మి రాజేశ్వరరావు బుధవారం స్దానిక ఉనుకూరు,అంబాడ వెంకటాపురం పంచాయితీల్లో IVRS కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి శానిటేషన్ వర్కర్ల చెత్తసేకరణ, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ శానిటేషన్ సేవలను మరింత మెరుగుగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం IVRS పై స్దానికులకు అవగాహన కల్పించారు.
NTR: తిరువూరు మండలం మల్లేల గ్రామ సర్పంచ్ వంగూరు మరియమ్మ 5 సంవత్సరాలు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేశారు. కాగా దంపతులను గ్రామ వైసీపీ కమిటీ ఘనంగా సన్మానించింది. అందరికీ సానుకూలంగా స్పందిస్తూ, ప్రతి పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశారన్నారు. గ్రామములోని అన్ని వర్గాల వారికి చేదోడు వాదోడుగా ఉండి పని చేశారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ASR: మాకవరపాలెం మండలం తామరం సెంటర్‌లో టీడీపీ నాయకుడు కోసూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను బుధవారం ప్రారంభించారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు, కూలీలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం సినీ నటి గీత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో పలువురు ఫొటోలు దిగారు.
NDL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని బుధవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
CTR: చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని ఆనగల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పసుపు పోషణ ఆరోగ్య పరిరక్షణపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్, గురజాల చెన్నకేశవులు పాల్గొన్నారు.
NDL: డోన్‌లో అల్లు అర్జున్ అభిమానుల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా హాజరయ్యారు. రక్తదానం ప్రాణదాతతో సమానమని, చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
SKLM: లావేరు (M) బుడుమూరులో అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలు జొన్నపంట, 200 ఎకరాలు అరటితోటలు మిరప, నువ్వు, వరిసేను నేలమట్టమయ్యాయి. రైతు ప్రతి నిధి బృందం బుధవారం పర్యటించింది. మొక్కజొన్న ఎకరాకు రూ. 50 వేలు, అరటి ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ. లక్ష నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా CPM కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయాలన్నారు.
ATP: గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి బుధవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.