KRNL: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చూపుతున్న దూరదృష్టి నాయకత్వం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మరింత ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఓ పాత ఫోటోను పంచుకున్నారు.
ATP: CM చంద్రబాబు 76వ జన్మదినం వేళ అనంతపురంలోలో రూ.76 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు MLA దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. సీఎం 76 ఏళ్ల వయసులోనూ 20 గంటల పాటు శ్రమిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు షరీఫ్ పాల్గొన్నారు.
PPM: విద్యార్దులు మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా విద్యపైనే దృష్టి సారించాలని పాలకొండ DSP రాంబాబు సూచించారు. సోమవారం మాదక ద్రవ్యాల నివారణపై పాలకొండలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీగా వెళ్లి RTC కాంప్లెక్స్ వద్ద మానవ హారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు వదిలితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
BPT: ఏల్చూరు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధి హామీ పనుల వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కార్మికులతో కలిసి పనులు చేపట్టి శ్రమదానం చేశారు. అనంతరం పేదలకు బట్టలు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో ఉపాధి హామీ పనులు ముఖ్యమని తెలిపారు.
కృష్ణా: ఉయ్యూరు నూతన మున్సిపల్ కమిషనర్‌గా ఎం.సుభాష్ చంద్రబోస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కమిషనర్ తెలిపారు. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.
ASR: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సోమవారం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తుడుము సుబ్బారావు, ఎం స్వామి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సీఎం సేవలను కొనియాడారు.
NDL: ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో సోమవారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి ఆధ్యాత్మికత, సమానత్వం, మానవ విలువలకు ప్రతీక అని అన్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
ELR: దెందులూరు నేషనల్ హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక కారు ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న వ్యక్తులకు గాయాలు కాగా స్థానికుల సహకారంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
KDP: డ్వాక్రా మహిళలకు AP ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయనుంది. డ్వాక్రా మహిళలు ఎంచుకున్న రంగంలో పెట్టుబడులు పెట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. స్త్రీనిధి కింద డ్వాక్రా సంఘంలోని ఒక్కో సభ్యురాలికి ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. 2 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని కేవలం 48 గంటల్లోనే అకౌంట్లోకి జమ చేయనుంది.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం వైశాఖమాసం శుద్ధ తదియ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం చిన్నారులతో కిటకిటలాడింది. పటికి బెల్లం తులాభారం కూడా నిర్వహించారని అర్చకులు తెలిపారు.
KRNL: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడంలో చంద్రబాబు పాత్ర కీలకమని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఆయన ఒక విజినరీ లీడర్ అని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అమోఘమన్నారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం గుడివాడ అడిషనల్ జడ్జి, జి సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వాటి ఆలయం మర్యాదలతో కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. వెంకన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని జడ్జి వివరించారు.
ప్రకాశం: విద్యా వారోత్సవాల సందర్భంగా “బడిపిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా సోమవారం తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. తుమ్మలచెరువు జనరల్ పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నెల్లూరు: విడవలూరు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో జెట్టీ నిర్మాణం కోసం కృషిచేస్తున్నట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలోని అధికారులకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం పరిశీలించారని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా తన వంతు కృషిచేస్తానని ఎంపీ మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
KRNL: ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని సోమవారం ఆర్ఐవో జి. లాలెప్ప తెలిపారు. కాగా, దీనిపై ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదన్నారు. అటు, ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి సెకండియర్‌లోకి ప్రవేశించిన విద్యార్థులకు ఈ నెల 1 నుంచే 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభమైందన్నారు.