ATP: ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఏప్రిల్ 8న అనంతపురం పాలిటెక్నిక్ క్యాంపస్‌లో HCL టెక్‌బీ వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 2025లో 75 శాతం మార్కులు సాధించిన వారు, 2026లో పరీక్షలు రాసిన వారు దీనికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణతో పాటు స్ట్రైఫండ్ వస్తుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 9966828536 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
E.G: మాజీ సీఎం, YCP అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కారిడార్‌పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం విమర్శలు గుప్పించారు. పార్టీలోని నేతలైన వంశీలోని VA, నానిలో NA, బొత్సలో BO, జగన్‌లో JA, అప్పల నాయుడులో NA తీసుకుంటే VA-NA-BO-JA-NA వస్తుందన్నారు. తద్వారా జగన్ వైసీపీకి బదులుగా ‘వనభోజనం’ పార్టీ అని పెట్టుకోవాలన్నారు.
SKLM: శ్రీకాకుళంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పైడిశెట్టి జయంతి గురువారం ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం శుభ పరిణామమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే సాధ్యమైందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు అందించిన సహకారం గొప్పదన్నారు. ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
నంద్యాల: బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో తహశీల్దార్ పద్మావతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ పాస్ పుస్తకాలను తొలగించి, పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం వీటిని అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. రికార్డుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే వీఆర్వోకు తెలియజేయాలని ఆమె సూచించారు.
PPM: బలిజిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంజూరు చేసిన రిక్షాలు, తొట్టెలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రీన్ అంబాసిడార్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు సక్రమంగా తరలించే బాధ్యతను చేపట్టాలని సూచించారు. సక్రమంగా పనిచేసిన ప్రతినెల జీతాలు అందేలా చూస్తాం అన్నారు.
అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో బీ.కాం విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు ఇవాళ స్థానిక కూరగాయల మార్కెట్‌కు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మితా సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొనుగోలు, అమ్మకాలు, ధరల మార్పులు, డిమాండ్-సప్లై పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
W.G: ఆకివీడు పెదపేట హింసాత్మక ఘటనలో తెర వెనుక ఉన్న పాత్రధారుల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు స్పష్టం చేశారు. ఉండి మండలం సాగుపాడులో మాట్లాడిన ఆయన, ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఎవరితో ఫోన్‌లో సంభాషించారనే డేటా అంతా భద్రంగా ఉందని పేర్కొన్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా దోషులందరినీ బయటకు తీస్తామని తెలిపారు.
కడప: మైదుకూరు పట్టణంలో మద్యానికి బానిసైన తండ్రి తన కొడుకును రూ.50 వేలకే విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి ప్రొద్దుటూరులో ఉన్న బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. ఘటనలో ఆసుపత్రి సిబ్బంది పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.
కడప: కొండాపురం రైల్వే స్టేషన్ శివారులోని పంపు హౌస్-చిత్రావతి రైల్వే బ్రిడ్జి మధ్యలో గురువారం ఉదయం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మృతిడి తల మొండెం వేరు వేరు అయ్యి ట్రాక్ పైన పడినట్లు పేర్కొన్నారు. మృతి చెందడానికి గల కారణాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
VSP: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని గురువారం గాంధీ విగ్రహం వద్ద వర్తకులు వంట వార్పు కార్యక్రమంతో నిరసన చేపట్టారు. రోడ్డున పడ్డ నైట్ ఫుడ్ కోర్ట్ కార్మికులను ఆదుకోవాలని, 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నైట్ ఫుడ్ కోర్టు స్ట్రీట్ వెండర్స్‌కి ఉపాధి కల్పించాలన్నారు.
ELR: జీలుగుమిల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల వసతి గృహాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలన జరిపిన ఆయన, ముఖ్యంగా భోజన వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందించే ఆహారం మెనూ ప్రకారం సరైన విధంగా అందుతున్నదా లేదా అని పరిశీలించారు.
ELR: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు 93.75% పూర్తయ్యాయని చింతలపూడి కమిషనర్ రాంబాబు తెలిపారు. ఐదు సచివాలయాలకు మొత్తం 2,695 పింఛన్ దారులు ఉండగా రూ.1,21 లక్షల పంచవలసి ఉంది. ఒకటో తేదీ పూర్తి అయ్యేనాటికి 2,539 పింఛన్ దారులకు రూ.1,13,70,500 పంపిణీ చేసిన మిగిలిన 156 పింఛన్ దారులకు గురువారం పూర్తి చేస్తామని తెలిపారు.
KRNL: జిల్లా కలెక్టరేట్లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంపై కరపత్రాలను కలెక్టర్ డా. ఏ. సిరి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు లబ్ధిదారులకు ధృవపత్రాలు పంపిణీ చేశారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
W.G: పోడూరు మండలం జగన్నాధపురం శివారులో గురువారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇటుకల లోడుతో నరసాపురం నుంచి పెనుగొండ వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కాలువ వైపునకు తిరగబడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా బోల్తా పడటంతో లోడుపై కూర్చున్న ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి.
PLD: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఈ మేరకు ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి (22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య చేశాడు. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.