CTR: గంగవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‍లో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
KRNL: పెద్దకడబూరులోని పెద్దబావి సమీపంలో మఠం వద్ద చేతిపంపు చెడగపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కాలనీవాసులు బుధవారం వాపోయారు. వేసవి సమీపిస్తున్న వేళ నీటి కట కట మొదలయింది. చేతిపంపు ద్వారా వచ్చే నీటిని కుటుంబ అవసరాలకు వాడుకుందామని ఆశిస్తున్న కాలనీవాసులకు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
VZM: విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో బోధించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ బయాలజీ టీచర్స్ ఫోరం రిసోర్స్ పర్సన్ వీరప్పయ్య అన్నారు. జాతీయ సైన్స్ వారోత్సవాల్లో భాగంగా కస్పా పాఠశాలలో సైన్స్ సదస్సును నిర్వహించారు. ఉపాధ్యాయులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో విద్యను బోధించాలని సూచించారు.
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లాలో “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత ప్రయాణించే లారీ, బస్సు, కారు డ్రైవర్లను ఆపి నీళ్లతో ముఖం కడిగించి అలసట తగ్గించి సురక్షితంగా ప్రయాణించాలంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు.
SKLM: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్కలి ‘శక్తి టీం’ హెడ్ కానిస్టేబుల్ ఎం.గిరిధర్ అన్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడు ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, రోడ్డు భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు దుష్పరిణామాలపై వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదమని, చట్టవిరుద్ధమన్నారు.
NTR: MLC మొండితోక అరుణ్ బుధవారం శాసనమండలిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంపై ప్రశ్నలు అడగనున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. ORR నిర్మించేందుకు NTR జిల్లాలో భూసేకరణ ప్రక్రియ, రైతులకు ఇచ్చే నష్టపరిహారంపై అరుణ్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి జనార్ధనరెడ్డి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ATP: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గురు తిప్పే రుద్రస్వామిని జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు దర్శించుకున్నారు. మార్చి 6 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ శుభం కలగాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా 17వ డివిజన్ హరనాధపురం, బలరాం నగర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు, పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చి అసెస్మెంట్ విధించాలన్నారు. ఖాళీ స్థలముల పన్నులు విధించాలని ఆదేశించారు.
GNTR: మంగళగిరిలోని అమరావతి క్రికెట్ స్టేడియంను బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. వచ్చే మే నాటికి స్టేడియం పనులన్నీ పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ మైదానం త్వరలోనే క్రీడాభిమానులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.
కడప నగరంలో ఆప్‌కి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఒక దాత సహాయంతో 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, రవ్వ, చక్కర, మసాలా పదార్థాలు, సేమియాలు, బాదం, కాజు, నెయ్యి తదితరాలతో కూడిన కిట్లు 25 మందికి అందజేశారు. రంజాన్ మాసంలో పేదలకు ప్రభుత్వమే రంజాన్ తోఫా అందించాలని మక్బూల్ కోరారు.
VZM: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పేర్కొన్నారు. బుధవారం రాజాంలో జరిగిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల ఆవశ్యకతను గ్రామస్థాయిలో తెలిపేందుకు దోహదపడుతుందన్నారు.
AKP: వైసీపీ అధిష్ఠానం పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌ను నియమించింది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం లక్ష్యంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్థానిక నాయకత్వాన్ని ఏకం చేసే బాధ్యతలను అమర్నాథ్‌కు అప్పగించినట్లు జగన్ పేర్కొన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్‌లలో భాగంగా ఇవాళ 3, 4, 5వ డివిజన్‌లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉకాయపల్లి గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రత నిర్వహణను సమీక్షించారు. హాజరు నమోదును కూడా పరిశీలించి సమయపాలన పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.
GNTR: రాజధాని నిర్మాణంలో భాగంగా మందడం గ్రామంలో నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ అమలును వేగవంతం చేసే దిశగా సీఆర్‌డీఏ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో లేఅవుట్లను తనిఖీ చేశారు. మ్యాప్‌ల ద్వారా అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.
అన్నమయ్య: గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ 0863-2340678, వాట్సాప్ 85000 27678ను సంప్రదించాలని సూచించారు.