E.G: జిల్లా ప్రజలు భయపడకుండా క్యాన్సర్ నిర్ధారణ చికిత్స కోసం రాజమండ్రిలోని ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్(GTGH)లో, అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 కేజీల భారీ ట్యూమర్ క్యాన్సర్ ఆపరేషన్ బుధవారం విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.