E.G: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామానికి చెందిన జాలపర్తి రాజు బుధవారం పొలం దుక్కు దున్నడానికి లక్ష్మీపురం – పల్లంట్ల రోడ్డులో ట్రాక్టర్‌పై వెళుతుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రాజు పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.