• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వీధి కుక్కల బెడద.. ప్రజలు ఆవేదన

NLR: లింగసముద్రం మండలంలోని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది. రాత్రి వేళ వాహనదారులను వెంటాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పాదచారులపై గుంపులుగా దాడి చేస్తున్నాయి. తిమ్మారెడ్డిపాలెంలో 2 పిచ్చికుక్కలు సుమారు పదిమందిని కరిచి ఐదు గేదెలను గాయపరిచిన ఘటనతో గ్రామస్థలు భయపడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 2, 2026 / 11:32 AM IST

రాధాకాంత స్వామి ఆలయం వద్ద కామదహనం

SKLM: కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాధాకాంత స్వామివారి డోలోత్సవాలు మార్చి 1- 3వరకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామ దహన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం కమిటీ నిర్వాహకులు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ముందుగా ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తిరువీధి కార్యక్రమం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

March 2, 2026 / 11:29 AM IST

అయినవిల్లి విఘ్నేశ్వరుని సేవలో శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్

కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించే ఆయనకు వేద ఆశీర్వచన అందజేశారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు.

March 2, 2026 / 11:27 AM IST

‘అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దు’

VZM: బాణసంచా నిల్వ, తయారీ, విక్రయదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో హోల్సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దని, షాపులు-గోడౌన్ల వద్ద ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫైర్ అలారమ్స్, సురక్షిత వైరింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

March 2, 2026 / 11:27 AM IST

చిరుత దాడిలో దూడ మృతి..!

CTR: చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు.

March 2, 2026 / 11:27 AM IST

గుత్తిలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

ATP: గుత్తిలోని 4 కేంద్రాల్లో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి సంవత్సరం గణితం పరీక్ష కావడంతో సప్లమెంటరీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులు, కళాశాల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 11:26 AM IST

కేసీ కెనాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరిధిలోని కేసీ కెనాల్లో ఆదివారం గల్లంతైన ఒంగోలుకు చెందిన హేమంత్ (17) మృతదేహం సోమవారం ఈర్నపాడు సమీపంలో లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది డ్రోన్ సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 11:25 AM IST

‘సాయి ప్రసాద్ అనుభవం రాష్ట్రానికి ఉపయోగం’

KKD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సాయి ప్రసాద్‌కు TDP పోలిట్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన సాయి ప్రసాద్ CSగా బాధ్యతలు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

March 2, 2026 / 11:15 AM IST

సైన్స్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు

శ్రీకాకుళం ఆక్స్ ఫర్డ్ స్కూల్‌కు చెందిన 18 మంది విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ ఒలింపియాడ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. సైన్స్ డే సందర్భంగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కె. భాస్కరరావు ఈ విద్యార్థులకు బహుమతులు అందజేసి సత్కరించారు. స్కూల్ కరెస్పాండెంట్ అన్నెపు రమేష్ బాబు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

March 2, 2026 / 11:14 AM IST

BREAKING: తిరుపతిలో వాకర్స్ ఆందోళన

తిరుపతిలో సోమవారం ఉదయం వాకర్స్ ఆందోళనకు దిగారు. నగరవనం (దివ్యారామం) లోకి డబ్బులు చెల్లిస్తేనే ఎంట్రీ ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో వాకర్‌ను అడ్డుకున్నారు. దీంతో అందరూ కలిసి కపిలతీర్థం-అలిపిరి రోడ్డుపై ఆందోళనకు దిగారు. కిలో మీటర్ మేర వాహనాలు ఆగిపోయాయి. తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

March 2, 2026 / 11:08 AM IST

చంద్రబాబుతోనే గ్రామ సుపరిపాలన సాధ్యం

KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే గ్రామ సుపరిపాలన సాధ్యమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గత వైసీపీ హయాంలో గ్రామాభివృద్ధిని అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదన్నారు.

March 2, 2026 / 11:06 AM IST

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం

E.G: గోకవరం(M) గుమ్మలదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వైభవంగా శంకుస్థాపన జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన నిధుల నుంచి రూ. 15 లక్షలు కేటాయించగా, ఎంపీపీ గల్లా కృష్ణ, గళ్ళ రాము కొబ్బరికాయ కొట్టి ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 11:02 AM IST

‘నేటి నుంచి ముఖ హాజరు తప్పనిసరి’

ATP: ఉపాధి హామీ పథకంలో అక్రమాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ముఖ హాజరు విధానాన్ని నేటి నుంచి అమలులోకి తెచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ-కేవైసీ పూర్తి చేసిన 3.40 లక్షల మంది కూలీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. పని ప్రారంభంలో, ముగిశాక ఫోటోలు తీస్తేనే వేతనాలు జమ అవుతాయి. నెట్‌వర్క్ సమస్యలను అధిగమించి యాప్ ద్వారా హాజరు నమోదుకు అధికారులు చర్యలు చేపట్టారు.

March 2, 2026 / 11:02 AM IST

కెనడాతో తిరుపతి IIT ఒప్పందం

TPT: ఏర్పేడులోని ఐసర్, ఐఐటి విద్యా సంస్థల ప్రతినిధులు కెనడాలో జరిగిన యూనివర్సిటీస్ కెనడా ఎడ్యుకేషన్ షోకేస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో కెనడా, భారత్ మధ్య ఉన్నత విద్య, పరిశోధన, విద్యార్థి మార్పిడి రంగాల్లో సహకారం మరింత విస్తరించనుంది.

March 2, 2026 / 10:58 AM IST

శ్రీకాకుళం జాతీయ రహదారిపై చిమ్మచీకటి

శ్రీకాకుళం జాతీయ రహదారి-16 పై రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ దీపాలు అన్నీ వెలగక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వరుసగా ఉండే ఈ దీపాలలో మధ్య మధ్యలో కొన్ని పూర్తిగా వెలగడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో చీకటి అలముకుంటుంది. జాతీయ రహదారిపై లారీ చోదకులు కొన్నిచోట్ల సునకాలను ఢీ కొట్టడంతో అవి రోడ్డు మీదే ఉంటున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు వాపోతున్నారు.

March 2, 2026 / 10:53 AM IST