• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలి’

E.G: స్వర్గీయ నందమూరి తారకరామారావు కట్టించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాల్సి ఉందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ స్వయంగా ఇక్కడకి వచ్చి, ఇక్కడి భూములు పరిశీలించి స్కెచ్ గీసి మరీ విశ్వవిద్యాలయానికి భూములు కేటాయించారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన వంతుసాయంగా 50 లక్షలు విరాళం అందజేశారు.

October 23, 2025 / 07:32 PM IST

డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా ఎంపికలు

VZM: కొత్తవలస మండలం దెందేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 సవంత్సరాల బాల, బాలికల కొరకు డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా ఎంపికలు గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పాల్గొన్నారు.

October 23, 2025 / 07:29 PM IST

గుడ్లవల్లేరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కృష్ణా: భారీ వర్షాల కారణంగా గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు కంట్రోల్ రూమ్‌ను గురువారం ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లో ఆరుగురు పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లు మండల పరిషత్ అధికారి ఎం.డీ.ఇమ్రాన్ తెలిపారు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉండి, మండల పరిధిలో వర్షాలు, వరదలు, రహదారులు, గ్రామాల పరిస్థితులను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

October 23, 2025 / 07:23 PM IST

‘రహదారి పనులను వెంటనే ప్రారంభించాలి’

కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. టెండర్లు అయిపోయి 2 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు.

October 23, 2025 / 07:19 PM IST

కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవి

GNTR: టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల కరపత్రాన్ని ఎమ్మెల్యే మాధవి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు యువతకు ఉత్తమ స్ఫూర్తిని అందిస్తాయని, ధర్మం, నైతిక విలువలపై వారికి మంచి అవగాహన కలిగిస్తాయని తెలిపారు.

October 23, 2025 / 07:18 PM IST

‘గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలి’

ప్రకాశం: చంద్రశేఖరపురంలో ఇవాళ సీపీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

October 23, 2025 / 07:16 PM IST

డ్రైనేజీ సమస్యలపై కాలనీవాసుల ఆగ్రహం

KRNL: తారక రామారావు నగర్‌లో డ్రైనేజీ లేక చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో మురికినీరు, వర్షపు నీరు చేరి దోమల పుట్టుక పెరిగి మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి చెత్త సమస్యను పరిష్కరించాలని కోరారు.

October 23, 2025 / 07:16 PM IST

వినతుల పరిష్కారానికి హామీ ఇచ్చిన విజయ్ చంద్ర

PPM: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే తన ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు.

October 23, 2025 / 07:04 PM IST

గురుకుల పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే రూ. లక్ష ఆర్థికసహాయం

KKD: రౌతులపూడి మండలం ఏ. మల్లవరం గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సత్య ప్రభ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. పాఠశాలలో ఆటస్థలం లేకపోవడంతో విద్యార్థులు క్రీడా కార్యక్రమాలకు దూరమవుతున్నారని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంత ముఖ్యమో తనకు తెలుసని, అందుకే ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

October 23, 2025 / 07:04 PM IST

జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ASR: ఈనెల 24న మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అమిత్ బర్దార్ గురువారం తెలిపారు. అతి ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు నియమించామన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచామన్నారు. ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల చుట్టూ ప్రత్యేక బలగాలను నియమించామన్నారు.

October 23, 2025 / 07:04 PM IST

హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన ఈర లక్కప్ప

సత్యసాయి: మడకశిర నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జిల్లా వైకాపా అధ్యక్షురాలు, మడకశిర వైకాపా ఇంఛార్జ్ ఈర లక్కప్ప గురువారం హైదరాబాద్‌కు బయలుదేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి పార్టీ వ్యూహాలు, స్థానిక నేతల సమన్వయం అంశాలపై చర్చించనున్నారు.

October 23, 2025 / 07:04 PM IST

‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

SKLM: ఇచ్చాపురంలో పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో గురువారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాసులు నాయుడుకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ల మంజూరుకు కృషి చేస్తామని అన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

October 23, 2025 / 07:02 PM IST

కార్తీక మాసంలో విహారయాత్రల కోసం ప్రత్యేక బస్సులు: DPTO

VZM: కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు, విహార యాత్రల కోసం విజయనగరం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు DPTO జి.వరలక్ష్మి గురువారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 16 వరకు పంచారామాలు, శ్రీశైలం, శబరిమలై క్షేత్రాలకు అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9959225620, 7382924103 ఈ నంబర్లు సంప్రదించాలని కోరారు.

October 23, 2025 / 07:02 PM IST

పోలీస్ రక్షక్ స్కూలు విద్యార్థులకు డిజిటల్ స్లేట్స్ పంపిణీ

ATP: నగరంలోని పోలీస్ రక్షక్ ప్రైమరీ స్కూలు విద్యార్థులకు డిస్కవర్ అనంతపురం, ఏజీ‌ఎస్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ స్లేట్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, హ్యాండ్ వాష్ కిట్స్ వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ సమక్షంలో జరిగింది. వితరణ చేసిన అనిల్ కుమార్, ఏజీ ప్రమీలమ్మలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

October 23, 2025 / 07:01 PM IST

‘ఆటలు, నడక, నృత్యం తప్పనిసరిగా ఉండాలి’

ASR: మెదడుకు పదును పెట్టడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు, నడక, నృత్యం తప్పనిసరిగా ఉండాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. గురువారం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు.

October 23, 2025 / 07:00 PM IST