• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘నిడదవోలులో జన్మ భూమి ఎక్స్ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వాలి’

E.G: నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్‌లో ‘జన్మ భూమి ఎక్స్ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వాలని సీపీఏం జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 12 సంవత్సరాలుగా జన్మభూమి, కాకినాడ ఎక్స్ప్రెస్‌లకు నిడదవోలు రైల్వే స్టేషన్‌కి హాల్ట్ ఇవ్వడం లేదన్నారు.

October 23, 2025 / 04:35 PM IST

పెనుకొండలో 836వ రోజు అన్నదానం

సత్యసాయి: పెనుకొండ పట్టణంలో ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్‌‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో నిరంతరం అన్నదానం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేసి గురువారం నాటికి 836వ రోజుకు చేరుకుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. ఇతర గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలు ఉపవాసం ఉండకూడదని ఉద్దేశంతో మంత్రి సవిత క్యాంటీన్‌ సేవలను ప్రారంభించారు.

October 23, 2025 / 04:35 PM IST

‘పాలకొండను పాత రెవిన్యూ డివిజన్‌‌గా చేయాలి’

PPM: పాలకొండను పాత రెవిన్యూ డివిజన్‌గా చేయాలని TDP పాలకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పడాల భూదేవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ చేయకపోతే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని డిమాండ్ చేశారు. పాలకొండను మూడు ముక్కలు చేసి మూడు డివిజన్లో కలిపారని తెలిపారు.

October 23, 2025 / 04:32 PM IST

20 రోజుల్లో రాకపోకలు ప్రారంభం: పరిటాల సునీత

ATP: రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం పరిశీలించారు. 2017లో టీడీపీ ప్రభుత్వం రూ.74 కోట్లతో మంజూరు చేసిన ఈ బ్రిడ్జి పనులు వైఎస్సార్సీపీ పాలనలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేస్తోందని, మరో 20 రోజుల్లో రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.

October 23, 2025 / 04:20 PM IST

శివకుమార్‌తో వైసీపీ మైనార్టీ సెల్ నాయకుల భేటీ

GNTR: తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ను వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాన్‌బాషా, కార్యదర్శులు ఆసీఫ్, ఖలీల్, కార్యవర్గ సభ్యుడు షేక్ బాదుల్లా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

October 23, 2025 / 04:19 PM IST

‘PM ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొండి’

W.G: పి.ఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇవాళ భీమవరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. గృహ నిర్మాణాలను చేపట్టేందుకు జిల్లాలోని 319 రెవిన్యూ గ్రామాల్లో అక్టోబర్ 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించడం జరిగిందన్నారు.

October 23, 2025 / 04:17 PM IST

‘ఆధార్ సేవ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి’

SKLM: ప్రభుత్వ ఆదేశాలు మేరకు పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ నమోదు కార్యక్రమాన్ని ఈనెల 30 వరకు కొనసాగిస్తున్నామని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. గురువారం జలుమూరు మండలం చల్లవానిపేట జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

October 23, 2025 / 04:14 PM IST

రాజయ్యపేట మత్స్యకారులకు వైసీపీ పూర్తి మద్దతు

VSP: నక్కపల్లి రాజయ్యపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. గురువారం ఆశిలుమెట్ట వద్ద జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారులను ఒంటరిగా వదిలిపెట్టకుండా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

October 23, 2025 / 04:14 PM IST

బ్రహ్మంగారి మఠంలో స్వచ్ఛ భారత్

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ డా.డీ.ఎల్ రవీంద్రారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.కే వల్లి నిర్వహణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముండ్లపాటి చంద్ర శేఖర్, కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

October 23, 2025 / 04:12 PM IST

‘కల్తీ మద్యం పాపం నాటి వైసీపీ ప్రభుత్వానిదే’

CTR: రాష్ట్రంలో కల్తీ మద్యం పాపం నాటి వైసీపీ ప్రభుత్వానిదేనని MLA జగన్ మోహన్ విమర్శించారు. గురువారం చిత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములా తెచ్చారన్నారు. ఐదేళ్లు కల్తీ మద్యం మాఫియా నడిపి వేలకోట్లు దోచుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లు కూటమిపై నిందల మోపుతున్నారని చెప్పారు.

October 23, 2025 / 04:10 PM IST

‘వైద్య, విద్య సేవలను ప్రైవేటు పరం చేయడం దారుణం’

VZM: వైద్య, విద్యను ప్రైవేటు పరం చేయాలనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ విక్రాంత్ అన్నారు. గురువారం వంగరలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందించడమే వైసీపీ లక్ష్యమని నియోజకవర్గ ఇంఛార్జ్ రాజేశ్ పేర్కొన్నారు.

October 23, 2025 / 04:04 PM IST

మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేసిన మంత్రి

NLR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నారు.

October 23, 2025 / 04:01 PM IST

మర్యాదపూర్వకంగా కలిసిన పీఏసీఎస్ ఛైర్మన్లు

అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన పీఏసీఎస్ ఛైర్మన్లు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త పీలా గోవిందును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరందరిని ఆయన అభినందించారు. కలిసిన వారిలో అన్నపూర్ణ పీఏసీఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ, కసింకోట ఛైర్మన్ సిద్ది రెడ్డి శ్రీనివాసరావు, నర్సింగబిల్లి ఛైర్మన్ నిరంజన్ కుమార్ ఉన్నారు.

October 23, 2025 / 03:53 PM IST

ఆమదాలవలసలో ఉచిత హోమియో వైద్య శిబిరం

SKLM: ఆమదాలవలస లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు జేకే వెంకు బాబు తెలిపారు. ఆమదాలవలస రైతు బజార్ సమీపంలో గల మెహర్ బాబా ప్రార్థన మందిరం వద్ద నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో, డాక్టర్ రేష్మిని (ఎండి హోమియో) పలువురు రోగులకు ఉచిత, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు.

October 23, 2025 / 03:53 PM IST

కోడూరులో విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

కృష్ణా: కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెరపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతి చెందారు. ఎస్సై చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సానందుల నాంచారయ్య (60) బుధవారం తన పూరిపాకలో విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. మృతుడి కుమార్తె తన్నీరు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

October 23, 2025 / 03:48 PM IST