సత్యసాయి: పెనుకొండ పట్టణంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో నిరంతరం అన్నదానం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి గురువారం నాటికి 836వ రోజుకు చేరుకుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. ఇతర గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలు ఉపవాసం ఉండకూడదని ఉద్దేశంతో మంత్రి సవిత క్యాంటీన్ సేవలను ప్రారంభించారు.