PPM: రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన భూ సమస్యలు పరిష్కరించాలని సాలూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారిని ఏం.సుధారాణి పేర్కున్నారు. శుక్రవారం పాచిపెంట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సాలూరు నియోజకవర్గంలో 13 సమస్యలు వచ్చాయని, ఈ సమస్యకు ఎంత వరకు పరిష్కారమయ్యాయి అనేది అడిగి తెలుసుకున్నారు.
ATP: తాడిపత్రి మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా పేరు పొందిన వీరాపురంలో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పికెట్‌లో ఉన్న కానిస్టేబుళ్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్థులతో మమేకమై గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
NLR: పురిణి ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం (సొసైటీ) ఛైర్మన్ మర్రి బోయిన సురేంద్ర రైతులకు పలు సూచనలు చేశారు. శనివారం రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కావున రైతు సోదరులు ఆధార్ కార్డు, పొలం పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సొసైటీని సంప్రదించాలన్నారు.
WG: గ్రామాలకు మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏ పార్టీలో గెలిచినా సర్పంచ్‌లను గౌరవిస్తున్నామన్నారు. రానున్న మూడేళ్లలో రోడ్లు, డ్రెయినేజీలు పూర్తి చేస్తామన్నారు. విద్య, విద్యుత్, హౌసింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు.
KDP: రాచమల్లు చీకటి ఒప్పందాలు, అవినీతి త్వరలో బట్టబయలు చేస్తానని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ తనను బఫున్ అన్నంత మాత్రాన నా చిటికెన వేలి వెంట్రుక కూడా ఊడిపోదని రాచమల్లును ప్రవీణ్ ఎద్దేవ చేశారు. డిఎ డబ్ల్యు కాలేజీలో రాచమల్లు చేసిన అవినీతికి ఆధారాలైన పత్రాలతో వచ్చే ప్రెస్ మీట్‌లో చూపిస్తా అని అన్నారు.
CTR: వర్షాలు కురిసినప్పుడు పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని పుంగనూరు పశుసంవర్ధక శాఖ AD డాక్టర్ మనోహర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విషసర్పాల నుంచి పశువులను కాపాడుకోవాలని, ఎత్తైన ప్రాంతాలలో వాటిని ఉంచాలన్నారు. జీవాలు, పశువులకు నట్టల నివారణ మందులు, వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తెలిపారు.
SKLM: ఏపీ సురక్ష యాప్ ద్వారా కల్తీ మద్యాన్ని కట్టడి చేయొచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని ఓ మద్యం దుకాణంను శుక్రవారం సందర్శించారు. ప్లే స్టోర్ ద్వారా ఏపీ సురక్ష యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిల్లపైన ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మద్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.
అన్నమయ్య: పీపీపీ విధానంపై వైసీపీ, వామపక్షాలు అవస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి మండిపడ్డారు. ఇవాళ మదనపల్లెలోని ఆయన స్వగృహం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ విధానంతో ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు. ఈ మేరకు కూటమి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
NLR: విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు ఐక్యరాజ్యసమితి సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మధు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్‌కుమార్ నియోజకవర్గంలోని ఇద్దరు క్యాన్సర్ రోగులకు రూ. 5,000 ఆర్థిక సాయం శుక్రవారం అందించారు. 33వ వార్డుకు చెందిన క్యాన్సర్ పేషెంట్ ఈటి లక్ష్మి ఇంటికి వెళ్లి పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. అందజేశారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.
TPT: బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. చంద్రగిరి సబ్ డివిజన్ MR.పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
E.G: గోకవరం మండలం గంగంపాలెం ప్రభుత్వ ఎం.పీ.యు.పీ. పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ శిబిరంలో అప్తాలమిక్ ఆఫీసర్ సీహెచ్. ఆనందరావు 105 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురు విద్యార్థులకు దృష్టిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్‌లో ఆర్పీ రిలాక్స్ సెంటర్‌ను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. రిలాక్స్ సెంటర్‌ను ప్రారంభించడం ఎంతో శుభపరిణామమని శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి రిలాక్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.
NLR: సంగం మండలంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు భారీగా కురిసాయి. ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పొంగి పొర్లుతున్న వాగులను శుక్రవారం టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, సొసైటీ సాగునీటి సంఘాల సిబ్బంది పలువురు ప్రాంతాలను పరిశీలించారు. ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అన్నమయ్య: మదనపల్లె మండలం కోటవారిపల్లె గ్రామపంచాయతీలో లచ్చారెడ్డి చెరువు నిండి మొరవ పారడంతో టీడీపీ నాయకులు రాటకొండ మధుబాబు ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వరుస వర్షాలతో చెరువులన్నీ నిండి జలకలను తలపిస్తున్నయన్నారు. దీంతో త్రాగు, సాగునీరు సమస్య తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో చంద్రయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.