అనంతపురం నగరంలోని ఎస్సీ హాస్టల్లో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పరమేష్ మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు రూ. 3000కు పెంచాలని, సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ASR: జిల్లాలోని 11 మండలాలకు చెందిన గిరిజన యువతకు 45 రోజుల పాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సోమవారం తెలిపారు. అరకు డిగ్రీ కళాశాల హాస్టల్లో 120 మంది యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 10వ తరగతి పాసైన ఆసక్తి గల యువత పాడేరు ఐటీడీఏలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
PLD: పట్టణంలోని పురుషోత్తపట్నం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగించ లేదన్నారు. పురుషోత్తపట్నం ఆర్చి వద్ద ఉన్న కల్వర్టులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నీరు నిల నిల్వ ఉందన్నారు.
GNTR: దుగ్గిరాల లాకు వద్ద సోమవారం బైక్ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వగా, ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. విచిత్రమేమిటంటే, ప్రమాద తీవ్రతకు బైక్ పది అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. గాయపడిన వారిని చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్ష రూపాయలు నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు రామానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేమిరెడ్డి దంపతులు వారికి 50 వేల రూపాయలను సహాయాన్ని అందజేశారు. వేమిరెడ్డి దంపతులకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఎస్సై పోకల హారిక హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. మండలంలో కోడి పందేలు, జూదం,పేకాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు పల్లెల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండాలన్నారు. అనుమానిత పల్లె ప్రాంతాలపై కొంతమందిపై నిఘా వేసి ఉంచామని తెలిపారు.
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు ఆర్డీటీ సంస్థపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ ఛైర్మన్ జై భీమ్ రామాంజినేయులు కోరారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ బైకులు, కార్లు, ఇంటి గోడల పైన ‘సేవ్ ఆర్డీటీ’ అని రాసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో సత్తా చాటిన ద్రాక్షారామ విద్యార్ది కె.విష్ణు వర్ధన్‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఏడవ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ ఒక స్వర్ణ, ఒక రజిత పథకాన్ని సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి విద్యార్థికి రూ.5 వేలు నగదు అందజేశారు.
VSP: పెట్టుబడుల పేరిట ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆరోపించారు. తర్లువాడలో విలువైన భూమిని 99 పైసలకే సంస్థకు ఇచ్చిన నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, నగర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.
W.G: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతి ధామాన్ని మూసివేస్తున్నట్లు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి పునర్దర్శనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు, ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్‌లు సోమవారం సాయంత్రం పరామర్శించారు. రూ.50 లక్షలు నష్టపరిహారం 5 ఎకరాలు భూమి ఇల్లు అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
VZM: హ్యాకథాన్ పోటీల్లో గెలుపొందిన ఇద్దరు సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్ధినులను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అభినందించారు. విద్యార్థులు యాల యోగేశ్వరి, దాసరి తేజశ్వని హ్యాకథాన్ పోటీల్లో సత్తా చాటి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ ప్రోత్సహి...
VSP: మాజీ ఎంపీ, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సోమవారం అమరావతిలోని రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు.
TPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 390 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని, పెండింగ్ లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
E.G: గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, PGRS తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.