• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

ELR: సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజు కొనసాగాయి. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు దీక్ష చేశారు. సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కారం. దారయ్య అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 04:18 PM IST

585 మంది‌ విద్యార్థులు ‌గైర్హజరు

AKP: జిల్లాలో 34 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 13,939 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,354 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఎం వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 04:18 PM IST

పెదవలసలో ఆధార్ కేంద్రం ప్రారంభం

ASR: జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ వద్ద రైతు సేవ కేంద్రంలో బుధవారం ఆధార్ సేవలు ప్రారంభం అయ్యాయని సచివాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని పేరు మార్పులు, చేర్పులు, కొత్తగా ఆధార్ నమోదు సేవలు అందుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలిపారు.

February 25, 2026 / 04:16 PM IST

‘ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయండి’

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు, వంశధార మహేంద్ర తనయ నదుల పై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వలసలు వెళ్లకుండా సాగునీరు అందించాలన్నారు. పాత ప్రాజెక్టులకు మరమ్మతుల నిధులు కేటాయించాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

February 25, 2026 / 04:16 PM IST

సాయి బాబా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

TPT: తిప్పవరప్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శిరిడి సాయిబాబా మందిరం బాబావారి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేకం కార్యక్రమంను బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ & గూడూరు నియోజకవర్గ ఇంఛార్జి మెరిగ మురళీధర్ పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాధాలు స్వీకరించారు.

February 25, 2026 / 04:14 PM IST

CITU అంగన్వాడీ సమస్యలపై వినతిపత్రం

KRNL: పత్తికొండలో CITU అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షల క్రమంలో ఇవాళ పీడీ వద్ద ఐసీడీఎస్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు ఉద్యోగుల అవగాహన, సమస్యలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు త్వరిత పరిష్కారం చేపట్టాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగి ప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

తీరిన తాగునీటి సమస్య..!

CTR: పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు ఎస్సీ కాలనీలో కొద్ది రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. స్థానికులు అధికారులతో పాటు పలువురు నాయకుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు గ్రామంలో నూతన బోరు డ్రిల్ చేసి సమస్యను పరిష్కరించారు.

February 25, 2026 / 04:09 PM IST

గత పాలకుల వల్లే రోడ్ల దుస్థితి: పుల్లారావు

PLD: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లు దెబ్బతిని 43 వేల మంది చనిపోయారని ఎమ్మెల్యే పుల్లారావు అసెంబ్లీలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో రోడ్లకు రూ.9,900 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట-నరసరావుపేట, కోటప్పకొండ మార్గాలను విస్తరించాలని కోరారు. ఎన్.హెచ్ 167ఏ, 16 బైపాస్ సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

February 25, 2026 / 04:05 PM IST

జిల్లా టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీ

NTR: విజయవాడ గొల్లపూడిలో నిర్మించనున్న జిల్లా టీడీపీ కార్యాలయాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనురాధతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పార్టీ కార్యాలయం పార్టీ కార్య కలాపాలకు కేంద్రంగా, కార్యకర్తలకు మార్గదర్శ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా నిలిచేలా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.

February 25, 2026 / 04:05 PM IST

స్థల వివాదం ఘటనలో ఒకరిపై కేసు నమోదు: ఎస్ఐ

ATP: పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో సోమవారం జరిగిన స్థల వివాదంతో నాగన్న అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ముత్యాలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 04:03 PM IST

మంగళగిరిలో శరవేగంగా అభివృద్ధి పనులు

GNTR: మంత్రి లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆత్మకూరులో కోకాకోలా సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.35 లక్షలతో పలు పనులు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు 52, 53, 54లను ఆధునీకరించి, 62వ కేంద్రానికి స్మార్ట్ టీవీ అందించారు. జెడ్పీ హైస్కూల్‌కు కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, క్రీడా దుస్తులు అందజేశారు.

February 25, 2026 / 04:02 PM IST

‘రామాలయ అభివృద్ధికి సహకరించాలి’

VZM: పోలిపల్లి పైడితల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించినందుకు అసెంబ్లీలో రాజాం MLA కొండ్రు మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాజాంలోని గుళ్లసీతారాంపురంలోని 150 సంవత్సరాల చరిత్ర గల రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. పట్టణంలో, సారధి గ్రామంలో రైతులకు సంబంధించి 70 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.

February 25, 2026 / 04:02 PM IST

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

BPT: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు.

February 25, 2026 / 04:00 PM IST

పమిడిముక్కలలో ఉచిత క్యాన్సర్ శిబిరం

కృష్ణా: గ్రామీణ ప్రజలు ముందస్తు కాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని టిడిపి నేత వర్ల చైతన్య అన్నారు. బుధవారం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 04:00 PM IST

పారిశుద్ధ పనులను తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ

ATP: వజ్రకరూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జడ్పీ సీఈవో శివశంకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, మండల సమస్యలపై ఎంపీడీవోతో చర్చించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్ మోనాలిసాకు సూచించారు.

February 25, 2026 / 03:58 PM IST