PLD: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లు దెబ్బతిని 43 వేల మంది చనిపోయారని ఎమ్మెల్యే పుల్లారావు అసెంబ్లీలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో రోడ్లకు రూ.9,900 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట-నరసరావుపేట, కోటప్పకొండ మార్గాలను విస్తరించాలని కోరారు. ఎన్.హెచ్ 167ఏ, 16 బైపాస్ సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.