శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో అఖిలభారత 90వ కిసాన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. రైతు కార్పొరేటు వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వాల చేతుల మధ్య నలిగిపోతూ వ్యవసాయాన్ని చేస్తున్న రైతులను ఆత్మహత్యల స్థితికి తీసుకెళ్తున్నారన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం సమీపంలో 167 జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. SML డిగ్రీ కళాశాల ముందు, హనుమాపురం గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో ఏఎస్ఐ శివరాములు, టీడీపీ నేత బీపీ ఈరన్న పాల్గొన్నారు.
ATP: జిల్లాస్థాయి అండర్-19 చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక కోవూరు నగర్‌లోని విద్యారణ్య పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ నాగరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు 18,19 తేదీలలో అన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రితో హాజరు కావాలన్నారు.
BPT: పంగులూరు మండల పరిధిలోని రామకూరులో ఇవాళ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు విశేష స్పందన లభించింది. భూ రికార్డుల ప్రక్షాళన, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశించిన ‘రెవెన్యూ సదస్సు’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులు చెప్పారు.
KDP: ఖాజీపేట అగ్రహారానికి చెందిన విద్యార్థిని కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద వాతావరణంతో నిండిపోయింది.
KRNL: ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిప్రా అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై వివరాల మేరకు.. బెంగళూరు నగరానికి చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి బయలుదేరారు. ఆదోని శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు.
ELR: నూజివీడు మండలం యనమదల గ్రామంలో శనివారం మంత్రికి కోలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన రాకపోక సౌకర్యాలు అందుతాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ ట్యాంకర్ ఓ కారుపై పడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే వారి పరిస్థితిపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NDL: మహానంది గ్రామ సమీపంలోని అయ్యన్నగర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కాశీశ్వరి అంత్యక్రియలకు గాను భగత్ సింగ్ యూత్ సభ్యులు రూ.18 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం కాశీశ్వరి అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబమైన వారిని ఆదుకునేందుకు యూత్ సభ్యులు మహేష్, చంద్ర, శివలు చందాల రూపంలో రూ.18 వేలు ప్రోగు చేసి అంత్యక్రియలకు అందజేశారు.
సత్యసాయి: కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో ఉపాధ్యాయులకు కల్పించిన వసతులపై విద్యాశాఖ అధికారి కృష్ణప్పను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
TPT :మహోన్నత వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
కృష్ణా: గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులపై జరిగిన దాడిని వైసీపీ నేతలు శనివారం తీవ్రంగా ఖండించారు. గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరపడమే కాకుండా, వాటిని ప్రశ్నించిన స్థానికులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ASR: సామాజిక కార్యకర్త డా. కంబిడి కృష్ణకుమారి ‘ఉగాది సేవా చక్రవర్తి’ అవార్డును అందుకున్నారు. సమాజ సేవలో ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణకుమారి అరకులోయలో సీఆర్టీగా పనిచేస్తూ వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
ATP: రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అన్ని గ్రామాలు, మండలాల్లో ఘనంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.