• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మూల్యాంకనంపై సాంకేతిక నిఘా: డీఈవో

CTR: ఏప్రిల్ 4 నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కోసం చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయులకు నియమనిబంధనలు తెలియజేస్తామన్నారు. తప్పు చేస్తే పెనాల్టీల మోత మోగుతుందన్నారు. రోజుకి 40 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు.

March 28, 2026 / 11:27 AM IST

స్వచ్చాంద్ర-స్వర్ణాంద్ర నిర్వహించిన జిల్లా పోలీసులు

PPM: స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ సూచనల మేరకు శనివారం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అదేశాలతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల, SDPO, సర్కిల్ కార్యాలయాల అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది పాల్గొని వారి స్టేషన్లు/కార్యాలయాలు శుభ్రం చేయడంతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో వుండే చెత్తా చెదారం, పిచ్చిమొక్కలను, పచ్చికను తొలగించారు.

March 28, 2026 / 11:27 AM IST

మహిళపై దాడి.. కేసు నమోదు

NDL: కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లె గ్రామంలో ఇవాళ ఆదిలక్ష్మి అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వీరాంజి నాయక్ అనే వ్యక్తి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరాంజి నాయక్ ఆదిలక్ష్మి ఇంటి వద్ద ఉన్న దిమ్మెలను పడగొట్టాడని ఆమె ఆరోపించారు. అనంతరం ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.

March 28, 2026 / 11:20 AM IST

దేవనకొండలో వేలం పాటలకు ఆహ్వానం

KRNL: దేవనకొండ గ్రామపంచాయతీ పరిధిలోని బండ్లమెట్ట, కామేలా, సంత మార్కెట్ స్థలాలకు ఇవాళ వేలం పాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి రాముడు తెలిపారు. ఆసక్తి గలవారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చన్నారు. బండ్లమెట్టకు రూ.2.50 లక్షలు, కామేలకు రూ.50 వేల, సంత మార్కెట్‌కు రూ.1.50 లక్షలు డిపాజిట్‌గా నిర్ణయించారు. నిబంధనల మేరకు వేలం జరుగుతుందని వెల్లడించారు.

March 28, 2026 / 11:20 AM IST

టీడీపీ నేత రామలింగప్ప కన్నుమూత

SS: గుడిబండ మండలం మోరుబాగలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రామలింగప్ప అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆయన మృతి పట్ల మడకశిర తెలుగుదేశం పార్టీ కుటుంబం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

March 28, 2026 / 11:12 AM IST

బీటెక్ విద్యార్థిని మిస్సింగ్

CTR: రామకుప్పం (M) కంబాల దేవుని పలికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 28, 2026 / 11:11 AM IST

అనంతపురంలో నేడు ‘ఏఐ పోలీస్ హ్యాకథాన్’

ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం ‘ఏఐ పోలీస్ హ్యాకథాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేరాల నియంత్రణ, భద్రతలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై ఈ హ్యాకథాన్ సాగనుంది. సాంకేతికతను పోలీసు సేవల్లో మరింత సమర్థంగా వినియోగించుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

March 28, 2026 / 11:07 AM IST

విఘ్నేశ్వరస్వామి అన్నదాన ట్రస్టుకు భారీ విరాళం

కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శనివారం పీ. గన్నవరం మండలం ముంగండ వాస్తవ్యులు సుసర్ల వెంకట ఉమామహేశ్వర, యశస్వి వారి కుటుంబ సభ్యులు  రూ. 1,01,116  విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేష వస్త్రములతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

March 28, 2026 / 11:06 AM IST

‘పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి’

శ్రీకాకుళం: పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు. శనివారం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేటపోర్టు మంజూరు చేయించారని అన్నారు. దీనిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలియజేశారు.

March 28, 2026 / 11:06 AM IST

సీతానగరం మార్కెట్‌లో ఆవ చేపలు సందడి

కోనసీమలో పులస ఎంత ఫేమసో, తూర్పున సీతానగరం, పోలవరం ప్రాంతాల్లో దొరికే ‘ఆవ చేప’కు అంత క్రేజ్ ఉంది. గిరిజనులు మాత్రమే వేటాడే ఈ అరుదైన చేపలు శనివారం సీతానగరం మార్కెట్లోకి రావడంతో భోజన ప్రియులు ఎగబడ్డారు. పులసకు దీటుగా రుచి ఉండే ఈ ఆవ చేపలు అందుబాటు ధరలో లభించడంతో జనం వీటిని కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు.

March 28, 2026 / 11:02 AM IST

లింగోజిపల్లిలో ఎడ్ల పందేల పోటీలు

ప్రకాశం: కంభం మండలం లింగోజిపల్లిలో శ్రీరామనవమి పండగ పురస్కరించుకొని శనివారం ఎడ్ల పందాల పోటీలను నిర్వహించారు. వైసీపీ ఇంఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి హాజరై ప్రారంభించారు. అంతక ముందు రాముల వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

March 28, 2026 / 11:01 AM IST

ఏప్రిల్ 1న చేబ్రోలులో రాష్ట్రస్థాయి గుర్రం పందేలు

KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏప్రిల్ 1న రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చేబ్రోలు శివారునున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నివాసం పక్కనున్న అడవిపుంత మార్గంలో పందేలు జరుగుతాయన్నారు. సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని పందేలు ఏర్పాటు చేశామన్నారు.

March 28, 2026 / 11:01 AM IST

రూ.5 లక్షల ప్రమాద భీమా చెక్కు పంపిణీ

NLR: సీతారామపురం గుండుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత రాచాల కొండలరావు కుటుంబానికి పార్టీ ప్రమాద భీమా కింద రూ. 5 లక్షల చెక్కును మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, కూటమి నేతలు అందజేశారు. కార్యక్రమంలో యూత్ కన్వీనర్ పసుపులేటి వికాస్‌బాబు, గుండుపల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మెరిగ రవీంద్ర, కూత్రా రత్నయ్య, చంద్రారెడ్డి, జాషువా, ప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు.

March 28, 2026 / 11:01 AM IST

శ్రీరామక్షేత్రంలో ఆలయ శిఖర పునః ప్రతిష్ఠ

W.G: ఉండి బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామక్షేత్రంలో నూతన శిఖర పునః ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ అతి వైభవంగా నిర్వహించారు. 72 సంవత్సరాలు క్రితం నిర్మించిన ఆలయ శిఖరం శిథిలావస్తకు చేరుకోవటంతో తిరిగి శిఖరం పునః ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి చక్రస్థానం, మహా పూర్ణాహుతి జరిపారు. 

March 28, 2026 / 11:00 AM IST

ఎమ్మిగనూరులో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో పురపాలక కమిషనర్ ఎన్. గంగిరెడ్డి ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ఇవాళ నిర్వహించారు. మున్సిపల్, మెప్మా, సచివాలయ సిబ్బంది కలిసి జీరో వేస్ట్ కలెక్షన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.

March 28, 2026 / 11:00 AM IST