NDL: నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో ఇవాళ వైసీపీ సీనియర్ నాయకుడు పుల్లయ్య అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతుడు పుల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
W.G: మార్టేరు బస్టాండ్ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరగడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, భీమవరం వెళ్లే కూడళ్లలో కుక్కలు గుంపులుగా ఉండి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. బస్సులు ఎక్కే సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
KDP: సింహాద్రిపురంలో ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: మార్చి 16 నుంచి కొనసాగుతున్న పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద పోలీసుల పర్యవేక్షణ పెంచారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై కఠిన తనిఖీలు, సెక్షన్ 144 అమలు, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు.
అన్నమయ్య: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అసంపూర్తి డేటాను మార్చి 31 లోగా పూర్తి చేయాలని చిట్వేలి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ఆదేశించారు. చిట్వేలిలో ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ గ్రామం సిబ్బంది ప్రతి కుటుంబం వివరాలను ఖచ్చితత్వంతో నమోదుచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా డేటాను అప్డేట్ చేయాలని ఆదేశించారు.
KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు ఏప్రిల్ 1న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తలాటం హరీష్, నక్కా వెంకటేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, 2007 ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.
VZM: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు చంద్రమౌళి శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని భక్తులు తిలకించారు.
SS: నల్లమాడ మండలం దొన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబిస్ ఇండియా సంస్థ CSR కింద భారీ విరాళం అందజేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ యుయోంగ్ జూక్ ఆధ్వర్యంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కోసం 20 కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు ఫ్యాన్లు, లైట్లను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయ బృందం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని కీలకమైన నరసాపురం పోలీస్ సబ్ డివిజన్‌కు గత కొంతకాలంగా పూర్తిస్థాయి డీఎస్పీ లేక వెలవెలబోతోంది. ఫిబ్రవరి 26న డాక్టర్ శ్రీవేద బదిలీ అయినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. పది పోలీస్ స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కీలకమైన ఈ సబ్ డివిజన్‌కు వెంటనే అధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
ATP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. మార్చి 29న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. పాత జెండా దిమ్మెలను శుభ్రం చేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రీకాకుళం: మందస పట్టణంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న పురుషోత్తమ స్వామి శనివారం ఆకస్మికంగా మరణించారు. ఆయన ఆలయ అర్చకులుగా సేవలందించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన చూపిన భక్తిశ్రద్ధలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన జీయర్ స్వామికి ప్రియ శిష్యులలో ఒకరుగా గుర్తింపు పొందిన పురుషోత్తమ స్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు గ్రామంలో శనివారం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సామూహిక అభివృద్ధితో పాటు వ్యక్తిగత సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.
CTR: ఏప్రిల్ 4 నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కోసం చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయులకు నియమనిబంధనలు తెలియజేస్తామన్నారు. తప్పు చేస్తే పెనాల్టీల మోత మోగుతుందన్నారు. రోజుకి 40 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు.