• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీ

NDL: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్యాపిలి మండలం ఎస్. రంగాపురంలో ఎద్దుల బండలాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొని తమ ఎద్దుల బల ప్రదర్శన చేశారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయబడ్డాయి. గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడానికి దోహదపడతాయని నాయకులు తెలిపారు.

March 28, 2026 / 06:21 AM IST

పులికాట్ సరస్సులో నీటి కొరత.. పక్షుల ఇబ్బందులు

TPT: సూళ్లూరుపేట మండలం పులికాట్ సరస్సు ఎండిపోతుండటంతో వలస పక్షులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెలికాన్ పక్షి మృతి కలకలం రేపగా, మరిన్ని పక్షుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ ద్వారంలో పూడిక తొలగించకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

March 28, 2026 / 06:20 AM IST

మాజీ సీఎంపై సోమిశెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు

కర్నూలు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర, దేశ పరిణామాలపై అవగాహన లేకుండా వైసీపీ వర్గాల సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

March 28, 2026 / 06:18 AM IST

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆ శాఖ పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు తెలిపారు. గొండ్యాలపుట్టుగ, ప్రగడపుట్టుగ, పుక్కళ్లపాలెం, జాలారిపాలెం, కొత్తపాలెం, కవిటి కొత్తూరు, కవిటి టౌన్‌కు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.

March 28, 2026 / 06:14 AM IST

ఉరుసు ఉత్సవాల గోడపత్రాల ఆవిష్కరణ

KDP: కమలాపురంలో ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఉరుసు ఉత్సవాల గోడపత్రాలను కన్వీనర్ ఇస్మాయిల్ హిందూ క్రైస్తవులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఉత్సవాల్లో నాలుగు రోజుల పాటు నిత్యం అన్నదానం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 3న నిర్వహించే ఎద్దుల బండలాగుడు పోటీల్లో విజేతలకు రూ. 50 వేలు, 30 వేలు, 20 వేలు, 10 వేలు చొప్పున బహుమతులు అందజేస్తారన్నారు.

March 28, 2026 / 06:09 AM IST

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

VSP: పీఎం పాలెం పరిధిలో శ్రీనివాసనగర్‌కు చెందిన పైల రఘు (38) ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు పీఎంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైందని సీఐ జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. భార్య సీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

March 28, 2026 / 06:09 AM IST

ఆకివీడులో 57 మందిపై కేసు నమోదు: ఎస్సై

W.G: ఆకివీడులో పెదపేటలో శ్రీరామనవమి వేడుకల్లో శుక్రవారం జరిగిన ఘర్షణకు సంబంధించి ఐదుగురిని గాయపరచిన కేసులో 57 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత నాగరాజు చెప్పారు. ఆకివీడు మండల పరిధిలో శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై వివరించారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించకూడదన్నారు.

March 28, 2026 / 06:06 AM IST

భవనాలను ప్రారంభించిన గుంతకల్లు డీఆర్ఎం

ATP: గుంతకల్లు రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ పరిధిలో పరిపాలనా భవనం, రైల్వే సిబ్బందికి సంబంధించిన క్యాంటిన్‌ను శుక్రవారం సాయంత్రం గుంతకల్లు డివిజనల్ రైల్వే మ్యానేజర్(డీ.ఆర్.ఎం) చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించడం జరిగింది. ఈ పరిపాలనా భవనంలో కాన్ఫరెన్స్ రూమ్, ఆఫీసర్స్ ఛాంబర్, టెక్నికల్ రూమ్ కలిగి ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

March 28, 2026 / 06:04 AM IST

నేడు కిర్లంపూడిలో మండల పరిషత్ బడ్జెట్ సమావేశం

KKD: కిర్లంపూడి మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాయిశెట్టి హరికృష్ణ తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు తోట రవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండల అభివృద్ధి, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.

March 28, 2026 / 06:02 AM IST

నేడు ఉచిత పశు వైద్య శిబిరం

BPT: చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం పంచాయతీ పుషాడపువారిపాలెంలో శనివారం పశువైద్య ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి శిబిరం మొదలవుతుంది. పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరీక్షలు, ఔషధాల పంపిణీ ఉంటుందని తెలిపారు.

March 28, 2026 / 06:00 AM IST

నేడు మృతదేహాలను అప్పగించేందుకు కసరత్తు

ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 28 మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బస్సులో సజీవ దహనమైన 14 మంది డీఎన్ఏని వైద్యులు పరీక్షిస్తున్నారు. నేడు పరీక్షలు పూర్తయిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రంలోపు మృతదేహాలను అప్పగించే అవకాశంవుంది.

March 28, 2026 / 06:00 AM IST

పెద్ద కొట్టాలపల్లిలో ‘రణబాలి’ సందడి

ATP: విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లిలోని పాత ఇంట్లో ‘రణబాలి’ చిత్ర షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. హీరో విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించింది. నాలుగు రోజులపాటు ఇక్కడ షూటింగ్ కొనసాగనుంది. సినీ బృందం రాకతో గ్రామంలో సందడి నెలకొనగా, అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

March 28, 2026 / 05:34 AM IST

‘ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి మూల్యాంకనం’

ATP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కోసం ఎగ్జామినర్లను తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా నియమించనున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణ మాదిరిగానే మూల్యాంకన విధులకు సంబంధించిన నియామక ఉత్తర్వులను ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ల ద్వారా నేరుగా పంపనున్నారు.

March 28, 2026 / 05:09 AM IST

తాడేపల్లిలో నేడు తెప్పోత్సవం

GNTR: తాడేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. దుర్గగుడి అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి, ఈ తెప్పోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

March 28, 2026 / 05:00 AM IST

నరసరావుపేటలో నేడు కార్టూన్ల ప్రదర్శన

BPT: నరసరావుపేటలో నేస్తం ట్రస్టు, ఏపీ కార్టూనిస్టుల సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన జరగనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పోలా త్రివిక్రమరావు, కార్టూనిస్ట్ సంఘం అధ్యక్షుడు అన్నం శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్టూన్లు-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అనే అంశంపై చర్చావేదిక ఉంటుందన్నారు.

March 28, 2026 / 05:00 AM IST