• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీకోదండరామునికి చెవిరెడ్డి సారె సమర్పణ

TPT: రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలోని నూతన ఆలయాల కుంభాభిషేక మహోత్సవంలో చెవిరెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు. చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి శ్రీకోదండరామునికి సమర్పించారు. ఆలయానికి చేరుకున్న వారికి గ్రామస్తులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

March 27, 2026 / 08:24 PM IST

లోకేష్ ప్రశంసలు అందుకున్న వెంకటరమణారెడ్డి

CTR: వెదురుకుప్పం మండలం క్లస్టర్ కన్వీనర్ బోడి రెడ్డి వెంకటరమణారెడ్డి ‘మై టీడీపీ’ యాప్‌లో 10,000 పాయింట్లు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన నిబద్ధతకు మెచ్చిన నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయం నుంచి TDP పార్టీ టోపీ, ప్రశంసా పత్రం అందజేశారు. మండలంలోని తెలుగు తమ్ముళ్లు వెంకటరమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

March 27, 2026 / 08:21 PM IST

31న జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో ఈ నెల 31న జర్నలిస్టుల కోసం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఏ.బాలకొండయ్య తెలిపారు. మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగే ఈ శిబిరంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తారని వివరించారు.

March 27, 2026 / 08:19 PM IST

‘అస్తి పన్నులు చెల్లించక పోతే చర్యలు’

కోనసీమ: మండపేట పట్టణంలో ఆస్తి పన్నులు చెల్లించకపోతే చర్యలు తప్పవని పుర పాలక సంఘం కమీషనర్ TV రంగారావు తెలిపారు. ఖాళీ స్థలాలు పన్నులు చెల్లించక పోతే ఆయా స్థలాలను మున్సిపాల్టీ స్వాధీనం చేసుకొని అక్కడ ప్లెక్సీ‌లు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం శ్రీ రామ నవమి సెలవు అయినప్పటికి సిబ్బందితో పన్నులు వసూలు చేసే విధులు నిర్వహించామని పేర్కొన్నారు.

March 27, 2026 / 08:17 PM IST

గంటల వ్యవధిలో 4 దూడలు బలి

ASR: దేవీపట్నం మండలం కొత్తవీధి సమీపంలో మరో దూడపై పులి దాడి చేసి చంపేసిందని స్థానికులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో గంటల వ్యవధిలోనే దాడికి గురైన దూడల సంఖ్య 4కి చేరింది. పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, బంధించేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక బలగాలు చూస్తుండగానే అక్కడ నుంచి పరారయ్యిందని స్థానికులు చెబుతున్నారు.

March 27, 2026 / 08:16 PM IST

బెట్టింగ్‌లో పాల్గొంటే కఠిన చర్యలు

BPT: బెట్టింగ్‌ అనేది పెనుభూతంలాంటిదని, ఆశ చూపించి యువతను అధఃపాతాళానికి నెట్టేస్తుందని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్‌ను అదునుగా చేసుకుని కొందరు చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్‌ బెట్టింగ్‌లకు ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉందన్నారు.

March 27, 2026 / 08:15 PM IST

ఎస్టీ కమిషన్ ఛైర్మన్ హాస్టల్ సందర్శన

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్-1ను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి శుక్రవారం సందర్శించారు. హాస్టల్‌లోని వసతులు, భోజన సదుపాయాలు, పరిశుభ్రతపై ఆయన పరిశీలించి, విద్యార్థినుల సమస్యలను తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 27, 2026 / 08:12 PM IST

రాయచోటిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

అన్నమయ్య: రాయచోటిలోని శ్రీ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

March 27, 2026 / 08:10 PM IST

వాహనాల తనిఖీలు ముమ్మరం

CTR: వెదురుకుప్పం మండలంలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్సై నవీన్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

March 27, 2026 / 08:07 PM IST

మాజీ స్పీకర్‌ను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

SKLM: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం పరామర్శించారు. ఇటీవల సీతారాంకు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆమదాలవలసలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణదాస్, తమ్మినేని నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

March 27, 2026 / 08:05 PM IST

స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలపై అమర్చిన నిబంధనలకు విరుద్ధమైన ఎల్ఈడీ లైట్లను తొలగించారు. ఎస్సై మాట్లాడుతూ.. అనుమతి లేకుండా అధిక వెలుతురు ఇచ్చే ఎల్ఈడీ లైట్లు వాడటం వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు.

March 27, 2026 / 08:04 PM IST

‘పెండింగ్ క్లయిమ్స్ విడుదల చేయాలి’

KKD: భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లయిమ్‌లు విడుదల చేస్తూ జీవో ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ డిమాండ్ చేసారు. పెద్దాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం యాసలపు సూర్యారావు భవనంలో గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన జరిగింది. సంక్షేమ బోర్డు పథకాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

March 27, 2026 / 08:00 PM IST

తేలప్రోలులో ఘనంగా యేసు తిరు హృదయ మహోత్సవాలు

కృష్ణా: తేలప్రోలులోని RCM చర్చి వద్ద యేసు తిరు హృదయ మహోత్సవాలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. రెండో రోజు ఫాదర్ సంకుర్ల శాంతిరాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. యేసు క్రీస్తు ప్రేమ, క్షమ, దయ గుణాల ప్రాధాన్యతను విశ్వాసులకు వివరించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

March 27, 2026 / 08:00 PM IST

నవమి వేడుకల్లో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు

W.G: శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు పలుచోట్ల శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గునుపూడి స్థూపం సెంటర్, సోమేశ్వరాలయం వద్ద రామాలయం, నాచువారి సెంటర్‌లో గల రాధాకృష్ణ మందిరం, రైతు బజార్ వద్ద, రామాయణం సుబ్బన్న గారి తోటలో గల శ్రీ కోదండ రామాలయం, శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మ వారి ఆలయం వద్ద జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.

March 27, 2026 / 08:00 PM IST

‘వ్యక్తిత్వ వికాసానికి రామాయణ పఠనం అవసరం’

KDP: పాత కడపలో హిందూ ధర్మం సమాజ ప్రార్థన దేవాలయాల సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, వైసీపీ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు రామాయణాన్ని చదివి ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతకు రామాయణమే స్ఫూర్తి అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

March 27, 2026 / 07:58 PM IST